ఐపీఎల్‌పై బీసీసీఐకి కేంద్రం అల్టిమేటం..
కరోనా మహమ్మరి ప్రభావంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక క్రీడా టోర్నీలు వాయిదా పడటమో లేదా పూర్తిగా రద్దవడమో జరుగుతోంది. పాకిస్తాన్‌లో ప్రజాదరణ పొందిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సైతం ప్లేఆఫ్ దశకు చేరుకున్న తర్వాత రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్‌ను కూడా బీసీసీఐ రెండు వారాల పాటు వెనక్కు జరిపింది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. […]
కరోనా మహమ్మరి ప్రభావంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక క్రీడా టోర్నీలు వాయిదా పడటమో లేదా పూర్తిగా రద్దవడమో జరుగుతోంది. పాకిస్తాన్‌లో ప్రజాదరణ పొందిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సైతం ప్లేఆఫ్ దశకు చేరుకున్న తర్వాత రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్‌ను కూడా బీసీసీఐ రెండు వారాల పాటు వెనక్కు జరిపింది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది.
కానీ తాజాగా కేంద్రం బీసీసీఐ చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. కరోనా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఈ మెగా ఈవెంట్‌ను పూర్తిగా రద్దు చేయాలంటూ అల్టిమేటం జారీ చేసింది. ఐపీఎల్‌ను రద్దు చేయడం వల్ల ప్రభుత్వ అధికారులు కరోనా నిరోధానికి సంబంధించిన చర్యలను మరింత వేగంగా చేపట్టే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. కాగా, ఈ మెగా ఈవెంట్ కొనసాగించడానికే మేం సిద్దంగా ఉన్నామని గత వారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ఖాళీ స్టేడియాల్లో ఆడటానికి సిద్ధమేనని ఫ్రాంచైజీ యాజమాన్యాలు తెలిపాయి. కానీ బీసీసీఐ నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించినట్టు సమాచారం. కాగా, శనివారం (మార్చి 21) జరిగే సమావేశంలో దీనికి సంబంధించి స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
Tags : IPL, BCCI, Central Govt, Sourav Ganguly, Franchisees, PSL