ఎంతమందిపై రైడ్ చేస్తారు?

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలకు మద్దతినిస్తున్న సాగు ఏజెంట్లను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. అన్నదాతల ఆందోళనలను నీరుగార్చడానికి అనేక కుయుక్తులు పన్నుతున్నదని ఆరోపించారు. ఇటీవలికాలంలో పంజాబ్‌లో సాగు ఏజెంట్ల(అర్థియాలు)పై తక్కువ నోటీసు కాలంతోనే ఐటీ దాడులు ముమ్మరమయ్యాయి. రైతుల ఆందోళనలకు సంఘీభావాన్ని ప్రకటించిన సాగు ఏజెంట్లపై కేంద్ర ప్రభుత్వం ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరిపిస్తున్నదని, ట్రేడర్లపై కక్షసాధింపు చర్యలకు దిగడం సరికాదని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనలను నీరుగార్చడానికే […]

Update: 2020-12-20 05:47 GMT

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలకు మద్దతినిస్తున్న సాగు ఏజెంట్లను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. అన్నదాతల ఆందోళనలను నీరుగార్చడానికి అనేక కుయుక్తులు పన్నుతున్నదని ఆరోపించారు. ఇటీవలికాలంలో పంజాబ్‌లో సాగు ఏజెంట్ల(అర్థియాలు)పై తక్కువ నోటీసు కాలంతోనే ఐటీ దాడులు ముమ్మరమయ్యాయి. రైతుల ఆందోళనలకు సంఘీభావాన్ని ప్రకటించిన సాగు ఏజెంట్లపై కేంద్ర ప్రభుత్వం ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరిపిస్తున్నదని, ట్రేడర్లపై కక్షసాధింపు చర్యలకు దిగడం సరికాదని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనలను నీరుగార్చడానికే కేంద్రం ఈ ఎత్తులు వేసిందని ఆరోపించారు. ప్రస్తుతం యావత్ దేశమే రైతుల వెనుక ఉన్నదని, ఎంతమందిపై రైడ్ చేయించగలదని ప్రశ్నించారు.

 

Tags:    

Similar News