West Bengal Chief Secretary: బెంగాల్ సీఎస్‌కు సెంట్రల్ డిప్యుటేషన్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ రివ్యూ మీటింగ్‌కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డుమ్మా కొట్టిన గంటల వ్యవధిలోనే ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ ని కేంద్రం రీకాల్ చేసింది. మే 31లోగా ఢిల్లీ నార్త్ బ్లాక్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. పీఎం భేటీకి సీఎం బెనర్జీ వెంటే ఉన్న బందోపాధ్యాయ్ కూడా హాజరుకాలేదు. బెంగాల్ సీఎస్‌గా 1987 క్యాడర్ ఐఏఎస్ అధికారి ఆలాపన్ బందోపాధ్యాయ్ పదవీకాలాన్ని మరో […]

Update: 2021-05-28 20:10 GMT

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ రివ్యూ మీటింగ్‌కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డుమ్మా కొట్టిన గంటల వ్యవధిలోనే ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ ని కేంద్రం రీకాల్ చేసింది. మే 31లోగా ఢిల్లీ నార్త్ బ్లాక్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. పీఎం భేటీకి సీఎం బెనర్జీ వెంటే ఉన్న బందోపాధ్యాయ్ కూడా హాజరుకాలేదు. బెంగాల్ సీఎస్‌గా 1987 క్యాడర్ ఐఏఎస్ అధికారి ఆలాపన్ బందోపాధ్యాయ్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల క్రితమే ఆమోదించింది. మరో మూడు నెలలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగడానికి కేంద్రమే ఆమోదించింది. తాజాగా, సెంట్రల్ డిప్యుటేషన్ మీద కేంద్రానికి రావాల్సిందిగా డీఓపీటీ ఆదేశించింది. డీఓపీటీ ప్రధాన మంత్రి కార్యాలయ పరిధిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News