‘సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ కోసం కేటీఆర్ లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో : సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐని తిరిగి పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకి గురువారం రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గతంలో కూడా పలు మార్లు కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని, ఇప్పటివరకు సానుకూల నిర్ణయం రాలేదని తన లేఖలో పేర్కొన్నారు. […]

Update: 2021-08-05 08:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐని తిరిగి పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకి గురువారం రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గతంలో కూడా పలు మార్లు కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని, ఇప్పటివరకు సానుకూల నిర్ణయం రాలేదని తన లేఖలో పేర్కొన్నారు.

1984లో ఆదిలాబాద్ పట్టణంలో 772 ఎకరాల్లో రూ.47 కోట్ల వ్యయంతో సీసీఐ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారని, దీంతోపాటు 170 ఎకరాల్లో సీసీఐ టౌన్ షిప్ కూడా ఉందన్నారు. ఈ ప్లాంట్ తో మరట్వాడ, విదర్భ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల సిమెంట్ అవసరాలు తీరేవని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు 1996లో నిధుల లేమితో కార్యకలాపాలు ఆగాయని, 2008లో సీసీఐ ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్రకటించి పూర్తిగా మూసి వేశారన్నారు. అయితే ఈ మూసివేతకు సంబంధించి ఉద్యోగులు కోర్టుకు వెళ్లారని, అప్పటి నుంచి ఈ అంశం పైన స్టేటస్ కో ఉందని, ఇప్పటికీ సుమారు 75 మంది ఉద్యోగులు కంపెనీ ఉద్యోగుల జాబితాలో ఉన్నారని తెలిపారు.

సీసీఐకి ప్రత్యేకంగా 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ డిపాజిట్ల మైనింగ్ లీజు ఉందని, ఇప్పటికీ 32 కేవీఏ విద్యుత్ సరఫరా కనెక్షన్, అవసరమైన నీటి లభ్యత ప్లాంట్‌కు నేటికీ ఉన్నదని లేఖలో పేర్కొన్నారు. కంపెనీ పునరుద్ధరణకు అవసరమైన బొగ్గు సరఫరాను స్థానిక సింగరేణి కార్పొరేషన్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. సీసీఐ ప్లాంట్ పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కేంద్రాన్ని కోరారు.

Tags:    

Similar News