హైదరాబాద్ మురుగునీటిలో కరోనా వైరస్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మురుగునీటి నమూనాలో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు సీసీఎంబీ (CCMB) డైరక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడించారు. మలమూత్రాల్లోనూ వైరస్ ఉంటుందన్న ఆయన.. ఆ విసర్జితాలు నీటిలో చేరడంతో మురికినీళ్లలో వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయన్నారు. 35రోజుల తర్వాత కూడా శరీరం నుంచి వైరస్ విడుదల అవుతోందని వివరించారు. మురుగునీటిని శుభ్రపరిచే కేంద్రాల నుంచి నమూనాలు సేకరించగా, అందులో వైరస్‌ను గుర్తించామని ఆయన తెలిపారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మురుగునీటి నమూనాలో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు సీసీఎంబీ (CCMB) డైరక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడించారు. మలమూత్రాల్లోనూ వైరస్ ఉంటుందన్న ఆయన.. ఆ విసర్జితాలు నీటిలో చేరడంతో మురికినీళ్లలో వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయన్నారు.
35రోజుల తర్వాత కూడా శరీరం నుంచి వైరస్ విడుదల అవుతోందని వివరించారు. మురుగునీటిని శుభ్రపరిచే కేంద్రాల నుంచి నమూనాలు సేకరించగా, అందులో వైరస్‌ను గుర్తించామని ఆయన తెలిపారు.