హాథ్రస్ కేసు పై సీబీఐ షురూ

న్యూఢిల్లీ: హాథ్రస్ కేసును సీబీఐకి బదిలీ చేసినట్టు కేంద్రం వెల్లడించిన తర్వాతి రోజే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. హాథ్రస్ నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టినట్టు సీబీఐ ఆదివారం ఓ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. సెప్టెంబర్ 14న బాధితురాలి గొంతు నులిమారని ఫిర్యాదు నమోదైందని, ఈ కేసుపై దర్యాప్తు చేయాలని యూపీ ప్రభుత్వం విజ్ఞప్తి, కేంద్రం నోటిఫికేషన్‌తో కేసు నమోదు చేసినట్టు పేర్కొంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని, దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు […]

Update: 2020-10-11 09:37 GMT

న్యూఢిల్లీ: హాథ్రస్ కేసును సీబీఐకి బదిలీ చేసినట్టు కేంద్రం వెల్లడించిన తర్వాతి రోజే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. హాథ్రస్ నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టినట్టు సీబీఐ ఆదివారం ఓ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. సెప్టెంబర్ 14న బాధితురాలి గొంతు నులిమారని ఫిర్యాదు నమోదైందని, ఈ కేసుపై దర్యాప్తు చేయాలని యూపీ ప్రభుత్వం విజ్ఞప్తి, కేంద్రం నోటిఫికేషన్‌తో కేసు నమోదు చేసినట్టు పేర్కొంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని, దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపింది. హత్యా నేరం, సామూహిక లైంగికదాడి, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Tags:    

Similar News