వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. సీబీఐ అదుపులో వైసీపీ నేత
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి నుంచి శివశంకర్‌రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్‌లో శివశంకర్‌రెడ్డి పేరు ప్రస్తావన వచ్చింది. అంతేకాదు వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు ఇచ్చిన […]
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి నుంచి శివశంకర్‌రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్‌లో శివశంకర్‌రెడ్డి పేరు ప్రస్తావన వచ్చింది.
అంతేకాదు వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల్లో సైతం శివశంకర్‌రెడ్డి పేరు ఉంది. ఇప్పటికే కడప, పులివెందులలో పలుమార్లు శివశంకర్‌రెడ్డిని సీబీఐ విచారించింది. ఇకపోతే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. ప్రస్తుతం దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సంగతి తెలిసిందే.