Electronic filing of Income Tax Forms: గడువు పొడిగించిన సీబీడీటీ

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఆదాయపు పన్ను వెబ్‌పోర్టల్‌లో సాంకేతిక లోపాల కారణంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల కోసం సీబీడీటీ ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లో కొంత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 15సీఏ/15సీబీ ఫారమ్‌లను మాన్యువల్ విధానంలో ఫైలింగ్ చేసేందుకు గడువును పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు ఆగష్టు 15 వరకు ఈ వెసులుబాటును ఉపయోగించి నేరుగా సమర్పించవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) వెల్లడించింది. కొత్త పోర్ట్‌లో సమస్యలు ఉండటం వల్లే పన్ను చెల్లింపుదారులకు గడువు […]

Update: 2021-07-21 06:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఆదాయపు పన్ను వెబ్‌పోర్టల్‌లో సాంకేతిక లోపాల కారణంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల కోసం సీబీడీటీ ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లో కొంత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 15సీఏ/15సీబీ ఫారమ్‌లను మాన్యువల్ విధానంలో ఫైలింగ్ చేసేందుకు గడువును పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు ఆగష్టు 15 వరకు ఈ వెసులుబాటును ఉపయోగించి నేరుగా సమర్పించవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) వెల్లడించింది.

కొత్త పోర్ట్‌లో సమస్యలు ఉండటం వల్లే పన్ను చెల్లింపుదారులకు గడువు ఇస్తున్నట్టు తెలిపింది. ఐటీ చట్టం 1961 ప్రకారం.. ఫారమ్ 15సీఏ/15సీబీని డిజిటల్ రూపంలో ఇవ్వాలనే నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. దీనికి జూలై 15 వరకు గడువు ఉండగా, ఆగష్టు 15కి పెంచారు. విదేశీ చెల్లింపుల ప్రయోజనాల కోసం వచ్చే నెల 15 వరకు సంబంధిత ఫారమ్‌లను మాన్యువల్‌గా అంగీకరించాలని సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News