TDP: టీడీపీకి షాక్: నారా లోకేశ్‌తోపాటు 33 మందిపై కేసులు నమోదు

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు గుంటూరు పోలీసులు షాక్ ఇచ్చారు. లోకేశ్‌పై పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. పోలీసులు లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 151 సీఆర్‌పీసీ చట్టం కింద నోటీసులు ఇచ్చి పెదకాకాని పీఎస్‌ వద్ద విడిచిపెట్టారు. నారా లోకేశ్‌తోపాటు […]

Update: 2021-08-17 07:01 GMT

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు గుంటూరు పోలీసులు షాక్ ఇచ్చారు. లోకేశ్‌పై పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. పోలీసులు లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 151 సీఆర్‌పీసీ చట్టం కింద నోటీసులు ఇచ్చి పెదకాకాని పీఎస్‌ వద్ద విడిచిపెట్టారు. నారా లోకేశ్‌తోపాటు మొత్తం 33 మంది టీడీపీ నేతలపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయ కలిగించడం, కొవిడ్ నిబంధనలు అతిక్రమించి గుమిగూడటం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్న అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, వంగలపూడి అనితతోపాటు మరో 26 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్రతోపాటు మరో 10మంది నేతలపై కొత్తపేట పీఎస్‌లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News