రూల్స్ బ్రేక్.. 70 మందిపై కేసులు, వాహనాలు సీజ్

దిశ, షాద్ నగర్ : నిబంధనలు అతిక్రమించి అనవసరంగా రోడ్డుపైకి వస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని షాద్ నగర్ ఏసీపీ కుషాల్కర్ హెచ్చరించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో లాక్ డౌన్ తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న 70 మంది పై కేసు నమోదు , అదే విధంగా 15 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. కొవిడ్ పాజిటివ్ వచ్చి.. […]

Update: 2021-05-16 07:02 GMT

దిశ, షాద్ నగర్ : నిబంధనలు అతిక్రమించి అనవసరంగా రోడ్డుపైకి వస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని షాద్ నగర్ ఏసీపీ కుషాల్కర్ హెచ్చరించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో లాక్ డౌన్ తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న 70 మంది పై కేసు నమోదు , అదే విధంగా 15 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.

కొవిడ్ పాజిటివ్ వచ్చి.. బయట తిరుగుతున్న మరో ముగ్గురుపై కూడా కేసులు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారు బయట కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. వారిని జైలుకు తరలించి కేసులు పెడతామని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అనుమతులు ఉన్నాయని వీటిని బేఖాతరు చేసి బయట తిరిగితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇక నుంచి కాలనీలపై కూడా దృష్టి సారిస్తామని హెచ్చరించారు. ఈ సమయంలో అనవసరంగా కేసుల్లో ఇరుకోవద్దని ఏసీపీ హితవు పలికారు.

 

Tags:    

Similar News