మంత్రి ఎర్రబెల్లిపై కేసు.. ఇరుక్కున్న చల్లా ధర్మా రెడ్డి, రాజీవ్ గాంధీ

దిశ ప్రతినిధి, వరంగ‌ల్: పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు, ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, క‌లెక్టర్ రాజీవ్‌ గాంధీ హ‌నుమంతుపై జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌లో ఈ నెల 27న కేసు న‌మోదైన‌ట్లు ఏఐసీసీ స‌భ్యుడు బ‌క్క జ‌డ్సన్ శుక్రవారం ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. ఈ నెల 9న వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్ గ్రామ సభలో మహిళ ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు అనుచిత‌, అస‌భ్య ప‌ద‌జాలంతో మాట్లాడిన‌ట్లుగా జ‌డ్సన్ ఆరోపించారు. ఈ మేర‌కు మంత్రి […]

Update: 2021-07-30 10:23 GMT

దిశ ప్రతినిధి, వరంగ‌ల్: పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు, ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, క‌లెక్టర్ రాజీవ్‌ గాంధీ హ‌నుమంతుపై జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌లో ఈ నెల 27న కేసు న‌మోదైన‌ట్లు ఏఐసీసీ స‌భ్యుడు బ‌క్క జ‌డ్సన్ శుక్రవారం ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. ఈ నెల 9న వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్ గ్రామ సభలో మహిళ ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు అనుచిత‌, అస‌భ్య ప‌ద‌జాలంతో మాట్లాడిన‌ట్లుగా జ‌డ్సన్ ఆరోపించారు. ఈ మేర‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవాల‌ని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మకు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింద‌ని వెల్లడించారు. ఈ నెల 27న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, వరంగల్ అర్బన్ కలెక్టర్‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు స్పష్టం చేశారు. మ‌హిళా క‌మిష‌న్‌లో కేసు రిజిస్టర‌యిన త‌ర్వాత మంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత‌ను కోల్పోయార‌ని అన్నారు. ఎర్రబెల్లి వెంట‌నే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కోరుతూ శ‌నివారం ఉద‌యం హైదరాబాద్‌లోని ఎర్రబెల్లి ఇంటి ఎదుట ఆమరణ దీక్ష చేప‌డుతున్నట్లు బ‌క్క జ‌డ్సన్‌ తెలిపారు.

Tags:    

Similar News