డర్టీ హరి సినిమాపై కేసు నమోదు

దిశ ప్రతినిధి , హైదరాబాద్: మహిళలను కించపరిచేలా తీసిన “”డర్టీ హరి” సినిమాను నిషేధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. అశ్లీలతతో కూడిన సినిమా పోస్టర్లు జూబ్లీహిల్స్ వెంకటగిరి ప్రాంతంలో వేయడంతో మహిళలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వంపై మండిపడ్డారు. యువతను తప్పుదోవ పట్టించేలా పోస్టర్లు ఉన్నాయని, పోస్టర్లే అశ్లీలతతో ఉంటే సినిమా ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. సినిమాను వెంటనే నిషేధించడంతో పాటు సినిమా తీసిన నిర్మాత, దర్శకుడిపై […]

Update: 2020-12-14 04:00 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్: మహిళలను కించపరిచేలా తీసిన “”డర్టీ హరి” సినిమాను నిషేధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. అశ్లీలతతో కూడిన సినిమా పోస్టర్లు జూబ్లీహిల్స్ వెంకటగిరి ప్రాంతంలో వేయడంతో మహిళలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వంపై మండిపడ్డారు. యువతను తప్పుదోవ పట్టించేలా పోస్టర్లు ఉన్నాయని, పోస్టర్లే అశ్లీలతతో ఉంటే సినిమా ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. సినిమాను వెంటనే నిషేధించడంతో పాటు సినిమా తీసిన నిర్మాత, దర్శకుడిపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ పోలీసులు స్పందించారు. సినిమా పోస్టర్లను తొలగించడంతో పాటు సినిమా తీసిన నిర్మాతపై సుమోటోగా కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News