పెళ్లి చేసుకోవాలని మహిళా డాక్టర్‌కు వేధింపులు !

దిశ, క్రైమ్ బ్యూరో: ఫేస్‌బుక్‌లో పరిచయమై, పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేస్తున్న ఓ డాక్టర్‌పై మహిళా డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిమ్స్ ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యలో సెకండ్ ఇయర్ చదువుతున్న వైద్యురాలికి ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సిద్దార్థ్ రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో డాక్టర్ సిద్దార్థ్ పెళ్లి ప్రతిపాదన చేయగా ఆమె తిరస్కరించింది. కొద్దిరోజుల క్రితం మహిళా డాక్టర్‌కు మ్యారేజ్‌ సెట్ కావడంతో సిద్ధార్థ్ ఫోన్‌లో వేధింపులు మొదలు […]

Update: 2020-12-15 09:29 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: ఫేస్‌బుక్‌లో పరిచయమై, పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేస్తున్న ఓ డాక్టర్‌పై మహిళా డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిమ్స్ ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యలో సెకండ్ ఇయర్ చదువుతున్న వైద్యురాలికి ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సిద్దార్థ్ రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో డాక్టర్ సిద్దార్థ్ పెళ్లి ప్రతిపాదన చేయగా ఆమె తిరస్కరించింది. కొద్దిరోజుల క్రితం మహిళా డాక్టర్‌కు మ్యారేజ్‌ సెట్ కావడంతో సిద్ధార్థ్ ఫోన్‌లో వేధింపులు మొదలు పెట్టాడు. ఈనెల 7న రాత్రి హాస్టల్ గదిలోకి వెళ్లి దాదాపు గంటపాటు గది నుంచి బయటకు రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం, 8వ తేదీ అర్థరాత్రి 12. 30 ప్రాంతంలో హాస్టల్ గది ముందు మద్యం సేవించి హాల్చల్ సృష్టించడంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై ఐపీసీ 354 (డి), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News