నటుడు మనోజ్ ఆత్మహత్యాయత్నం.. స్టెరాయిడ్స్ ఇష్యూనే కారణమా..?
దిశ, సినిమా : యాక్టర్ సాహిల్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. మరో ముగ్గురితో కలిసి యాక్టర్ మనోజ్ పాటిల్ సూసైడ్ అటెంప్ట్ చేసుకునేందుకు కారణమయ్యాడని ఫిర్యాదు అందిందని చెప్పారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మనోజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉండగా.. ఓషివర పోలీస్ స్టేషన్‌లో ఖాన్‌పై పాటిల్ కంప్లయింట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ కాంట్రవర్సీపై స్పందించిన సాహిల్.. తనకు ఈ ఇష్యూతో సంబంధమే లేదన్నాడు. మనోజ్‌కు రాజ్ ఫౌజ్దర్ అనే వ్యక్తికి […]
దిశ, సినిమా : యాక్టర్ సాహిల్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. మరో ముగ్గురితో కలిసి యాక్టర్ మనోజ్ పాటిల్ సూసైడ్ అటెంప్ట్ చేసుకునేందుకు కారణమయ్యాడని ఫిర్యాదు అందిందని చెప్పారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మనోజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉండగా.. ఓషివర పోలీస్ స్టేషన్‌లో ఖాన్‌పై పాటిల్ కంప్లయింట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ కాంట్రవర్సీపై స్పందించిన సాహిల్..
తనకు ఈ ఇష్యూతో సంబంధమే లేదన్నాడు. మనోజ్‌కు రాజ్ ఫౌజ్దర్ అనే వ్యక్తికి మధ్య జరిగిన ఎంటైర్ ఇష్యూ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాటిల్ వివరించాడు. రౌజ్ ఫౌజ్దర్ అనే వ్యక్తికి రూ. 2లక్షల విలువైన స్టెరాయిడ్స్ అమ్మాడని, దీంతో తనకు హెల్త్ ఇష్యూస్ రేజ్ అయ్యాయని తెలిపాడు. ఇందుకు సంబంధించిన బిల్స్ కూడా ఉన్నాయని, కావాలంటే నిరూపిస్తానని, ఈ విషయంలో ఫౌజ్దర్ సోషల్ మీడియా సపోర్ట్ కావాలని అడగడంతో తన హ్యాండిల్స్‌లో వీడియోస్ పోస్ట్ చేసినట్లు చెప్పాడు. దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని సాహిల్ ఖాన్ తెలిపాడు.