అంతా కంట్రోల్‌లోనే ఉంది : సీఎం కేజ్రీవాల్

దిశ, వెబ్ డెస్క్ :దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మనదేశంలో మొన్నటిదాకా ముంబై, తమిళనాడు, ఢిల్లీలో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యేవి. ఆయా రాష్ట్రాల్లోనే మరణాల సంఖ్య కూడా అధికంగా ఉండేది. తాజాగా ఢిల్లీలో కరోనా కేసులు కంట్రోల్ లోనే ఉన్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఇప్పుడిప్పుడే ఢిల్లీలో కోవిడ్ -19 పరిస్థితి అదుపులో ఉందని, రికవరీ రేటు మెరుగుపడుతోందని […]

Update: 2020-08-09 06:22 GMT

దిశ, వెబ్ డెస్క్ :దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మనదేశంలో మొన్నటిదాకా ముంబై, తమిళనాడు, ఢిల్లీలో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యేవి. ఆయా రాష్ట్రాల్లోనే మరణాల సంఖ్య కూడా అధికంగా ఉండేది. తాజాగా ఢిల్లీలో కరోనా కేసులు కంట్రోల్ లోనే ఉన్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని వివరించారు.

ఇప్పుడిప్పుడే ఢిల్లీలో కోవిడ్ -19 పరిస్థితి అదుపులో ఉందని, రికవరీ రేటు మెరుగుపడుతోందని ఆయన చెప్పారు. అంబేద్కర్ నగర్‌లోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడుతూ.. పరిస్థితి అధ్వాన్నంగా మారినట్లయితే పరిష్కరించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన పనిలేదని.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడూ అందుబాటులోనే ఉంది సహాయం అందిస్తారని తెలిపారు.

Tags:    

Similar News