చిత్తూరులోని స్కూల్లో కరోనా కలకలం

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా కరబలకోట మండలంలోని రిషివ్యాలీ ‌స్కూల్‌పై కరోనా పంజా విసిరింది. ఆ స్కూల్లో చదువుకుంటున్న 11 మంది విద్యార్థులకు కరోనా సోకింది. విద్యార్థులకు కరోనా సోకినట్టు గుర్తించిన స్థానిక ఏఎన్ఎం, వాలంటీర్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో కరబలకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి అనూహ్య సిబ్బందితో విద్యార్థులను పరీక్షించారు. కరోనా సోకినప్పటికీ విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఎలాంటి భయం అవసరం లేదని త్వరలోనే కోలుకుంటారని డా. అనూహ్య […]

Update: 2021-09-04 07:14 GMT

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా కరబలకోట మండలంలోని రిషివ్యాలీ ‌స్కూల్‌పై కరోనా పంజా విసిరింది. ఆ స్కూల్లో చదువుకుంటున్న 11 మంది విద్యార్థులకు కరోనా సోకింది. విద్యార్థులకు కరోనా సోకినట్టు గుర్తించిన స్థానిక ఏఎన్ఎం, వాలంటీర్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో కరబలకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి అనూహ్య సిబ్బందితో విద్యార్థులను పరీక్షించారు. కరోనా సోకినప్పటికీ విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఎలాంటి భయం అవసరం లేదని త్వరలోనే కోలుకుంటారని డా. అనూహ్య స్పష్టం చేశారు.

Tags:    

Similar News