గ్రూప్ -2,3,4 /SI, కానిస్టేబుల్ ప్రత్యేకం: జాగ్రఫీ కృష్ణా నది వ్యవస్థ
క్రిష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.
క్రిష్ణా నది
పొడవు: 1440 కి.మీ.
క్రిష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.
తెలంగాణలో కృష్ణా నది మొత్తం పొడవు: 450 కి.మీ.
జన్మస్థలం: పశ్చిమ కనుమలు/సహ్యాద్రి పర్వతాల్లోని (మహారాష్ట్ర) మహాబలేశ్వర్ వద్ద ఉన్న జోర్ గ్రామం.
-కృష్ణానది దేశంలో 3వ పొడవైన నది.
-దక్షిణ భారతదేశంలో 2వ పొడవైన నది.
-కృష్ణానదికి ప్రతి 12 ఏండ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి.
-ఈ నది పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరంలో ఉన్న జోర్ గ్రామం వద్ద జన్మించి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ.. తెలంగాణలోకి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం తంగడి గ్రామం వద్ద ప్రవేశిస్తోంది. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గుండా తెలంగాణలో నుండి.. కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల గుండా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తుంది.
నల్లగొండ జిల్లా నందికొండ వద్ద నాగార్జునసాగర్ ప్రాజెక్టును దాటి ఎడమ కాలువ (లాల్‌బహదూర్ శాస్త్రి కాలువ) సూర్యాపేట, కృష్ణా జిల్లాల గుండా.. కుడి కాలువ (జవహర్‌లాల్ కాలువ) గుంటూరు, కృష్ణా జిల్లాల గుండా ప్రవహిస్తూ విజయవాడ దగ్గర కలిసిపోతాయి. విజయవాడకు దిగువన (సుమారు 64 కి.మీ. దూరంలో) పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలి, మళ్లీ ఒకటిగా కలిసి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
-పులిగడ్డ వద్ద రెండు పాయల మధ్య ప్రాంతాన్ని దివి సీమ అంటారు.
-కృష్ణానదికి ఎడమవైపు జిల్లాలు (తెలంగాణలో): 1. మహబూబ్‌నగర్, 2. వనపర్తి, 3. నాగర్‌కర్నూల్, 4. నల్లగొండ, 5. సూర్యాపేట.
-కృష్ణానదికి కుడివైపు గల జిల్లా (తెలంగాణలో): 1. గద్వాల జోగులాంబ
-రాష్ట్రంలో కృష్ణా నది ప్రవహించే జిల్లాలు: 06