SAI Jobs: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఖాళీలు, అర్హత, జీతం పూర్తి వివరాలివే..!

ఢిల్లీ(Delhi)లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Update: 2024-11-08 13:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ(Delhi)లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 50 యంగ్ ప్రొఫెషనల్(Young Professional) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://sportsauthorityofindia.nic.in/sai/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. అప్లై చేసుకోడానికి చివరి తేదీ 30 నవంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

యంగ్ ప్రొఫెషనల్(Young Professional) - 50

విద్యార్హత:

సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, బీఈ, బీటెక్, ఎంబీబీస్ ఉతీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లకు మించి ఉండకూడదు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తారు.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 నుంచి రూ.70,000 వరకు జీతం ఉంటుంది.

Tags:    

Similar News