నిరుద్యోగులు అలర్ట్.. ఆ నెలలోనే రైల్వే గ్రూప్-డీ ఎగ్జామ్స్.. ఇవి చదివితే ఉద్యోగం మీదే..

కోటికి మందికి పైగా నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైల్వే గ్రూప్ డీ ఎగ్జామ్ కు సంబంధించి Railway Group-D Exams Schedule

Update: 2022-03-17 03:47 GMT

కోటికి మందికి పైగా నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైల్వే గ్రూప్ డీ ఎగ్జామ్ కు సంబంధించి షెడ్యూల్ త్వరలో తెలియనుంది. 

*ఈ ఎగ్జామ్స్ ను జూలై నెలలో వివిధ దశల్లో నిర్వహించేందుకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు కసరత్తులు చేస్తోంది. 

*మూడేళ్ల కింద విడుదలైన నోటిఫికేషన్ కొవిడ్ కారణం వల్ల వాయిదా పడుతూ వస్తుంది. 

*ఈ పరీక్ష కోసం కోటి మందికి పైగా అప్లై  చేశారు. 

*మొత్తం లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 

*అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్​ (సీబీటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్(Document Verification), మెడికల్ ఎగ్జామినేషన్(Medical Examination) ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేయనున్నారు. 

*సీబీట్ ఎగ్జామ్ లో మొత్తం 100 ప్రశ్నలకు గానూ 90 నిమిషాల సమయం ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు 120  నిమిషాల సమయం ఉంటుంది. 

*ఈ పరీక్షలో 100 మార్కులకు గానూ నాలుగు విభాగాల నుంచి మార్కుల వస్తాయి. 

*కరెంట్ అఫైర్స్- 20  మార్కులు

*జనరల్ సైన్స్- 20 మార్కులు

*రీజనింగ్ -30 మార్కులు

*అర్థమెటిక్-30 మార్కులు

*రీజనింగ్, జనరల్ అవెర్నిస్, అర్థమెటిక్ బాగా ప్రాక్టీస్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. 

*కరెంట్ అఫైర్స్ కు సంబంధించి ఎగ్జామ్ కు ముందు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చదివితే మంచి స్కోర్ చేయచ్చు. 

*అవార్డులు, పదవులు, చైర్మన్ల నుంచి మార్కులు వస్తున్నాయి. 

*జనరల్ సైన్స్ కు సంబంధించి ఫిజిక్స్ నుంచి పరికరాలు కనుగొన్న వ్యక్తులు, శాస్త్రవేత్తలు గురించి ప్రశ్నలు వస్తున్నాయి. 

*కెమిస్ట్రీ నుంచి మూలకాల వర్గీకరణ నుంచి మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. 

*స్టాండర్ట్ జీకే కి సంబంధించి దేశాలు-రాజధానులు, కరెన్సీలు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు, నదుల నుంచి మార్కులు వస్తున్నాయి. 

*ప్రతి తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 చొప్పును మార్కులు కట్ చేస్తారు. 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ ఎఫీషియెన్సీ  టెస్ట్ ఉంటుంది. 


Tags:    

Similar News