ఎయిమ్స్‌లో భారీగా నర్సింగ్ పోస్టుల భర్తీ.. ఎంపిక ఎలాగంటే..?

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్)- 4 నోటిఫికేషన్ విడుదలైంది.

Update: 2023-04-13 12:18 GMT

దిశ, కెరీర్: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్)- 4 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మే 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

పోస్టులు: ఎయిమ్స్‌లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

ఖాళీల వివరాలు:

ఎయిమ్స్ భటిండా - 142

ఎయిమ్స్ భోపాల్ - 51

ఎయిమ్స్ భువనేశ్వర్ - 169

ఎయిమ్స్ బీబీనగర్ - 150

ఎయిమ్స్ బిలాస్‌పూర్ - 178

ఎయిమ్స్ దేవ్ ఘర్ - 100

ఎయిమ్స్ గోరఖ్‌పూర్ - 121

ఎయిమ్స్ జోధ్‌పూర్ - 300

ఎయిమ్స్ కల్యాణి - 24

ఎయిమ్స్ మంగళగిరి - 117

ఎయిమ్స్ నాగ్‌పూర్ - 87

ఎయిమ్స్ రాయ్ బరేలీ - 77

ఎయిమ్స్ న్యూఢిల్లీ - 620

ఎయిమ్స్ పాట్నా- 200

ఎయిమ్స్ రాయ్‌పూర్ - 150

ఎయిమ్స్ రాజ్‌కోట్ - 100

ఎయిమ్స్ రిషికేశ్ - 289

ఎయిమ్స్ విజయ్‌పూర్ - 180

అర్హత: డిప్లొమా (జీఎన్ఎం) తోపాటు రెండేళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి లేదా బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ /బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్) /పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్ లేదా ఇండియన్ కౌన్సిల్ లో నర్సులుగా రిజిస్టరు కావాలి.

వయసు: 18 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి)

వేతనం: నెలకు రూ. 9300 నుంచి రూ. 34800 ఉంటుంది. మరో రూ. 4600 గ్రేడ్ పే ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: జనరల్ /బీసీ అభ్యర్థులు రూ. 3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 2400 ఉంటుంది. పీడబ్ల్యూడీ వారికి మినహాయింపు ఉంది.

ఎంపిక: నార్ షెట్ - 4 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష..ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభ తేది: ఏప్రిల్ 12, 2023

చివరితేది: మే 5, 2023.

సీబీటీ పరీక్షతేది: జూన్ 3, 2023.

వెబ్‌సైట్: https://www.aiimsexams.ac.in

Also Read...

ఆ కాలేజీలో డిగ్రీతో పాటు ఉచితంగా హాస్టల్.. ఫ్రీ ట్రైనింగ్

Tags:    

Similar News