NSC Jobs: నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు, అర్హత వివరాలివే..!
ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్(National Seeds Corporation) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్(National Seeds Corporation) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 188 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మార్కెటింగ్, అకౌంట్స్, స్టెనో గ్రాఫర్, ఫిట్టర్, మెకానికల్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.indiaseeds.com/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 30 నవంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
- ట్రెయినీ ఇంజినీర్ (Trainee Engineer) - 179
- మేనేజ్ మెంట్ ట్రెయినీ(Management Trainee) - 5
- సీనియర్ ట్రైనీ(Senior Trainee) - 2
- అసిస్టెంట్ మేనేజర్(Assistant Manager) - 1
- డిప్యూటీ జనరల్ మేనేజర్(Dy General Manager) - 1
విద్యార్హత:
పోస్టును బట్టి బీఈ/ బీటెక్/ బీఎస్సీ/డిప్లొమా/ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 50 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 30 ఏళ్లు, ఇతర పోస్టులకు 27 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.