టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2025-01-04 16:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 93 కేంద్రాలను సిద్ధం చేసినట్లు అధికారులు స్పష్టంచేశారు. కాగా మొత్తం 16,757 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా అభ్యర్థులు ఆదివారం నుంచి www.bse.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.


Similar News