దరఖాస్తులు సరిగా అప్‌లోడ్ చేయాలి.. మెడికల్బోర్డు సూచన
రాష్ట్ర వ్యాప్తంగా సివిల్అసిస్టెంట్సర్జన్ నియామకాల దరఖాస్తులను సరిగా అప్‌లోడ్ చేయాలని మెడికల్రిక్రూట్మెంట్బోర్డు సోమవారం ఒక ప్రకటనలో సూచించింది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సివిల్అసిస్టెంట్సర్జన్ నియామకాల దరఖాస్తులను సరిగా అప్‌లోడ్ చేయాలని మెడికల్రిక్రూట్మెంట్బోర్డు సోమవారం ఒక ప్రకటనలో సూచించింది. ప్రధానంగా ఎక్స్పీరియన్స్సర్టిఫికెట్లను సక్రమంగా అప్లోడ్చేయాలని పేర్కొన్నది. సరిగా చేయక పోవడంతో అభ్యర్థుల ఎంపికలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపింది. ఇప్పటికే అప్‌లోడ్ చేసిన వారు మరోసారి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ చేయాలని సూచించింది. దీనికి ఈ నెల 21 నుంచి 27 వరకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జూన్ 15న వైద్యారోగ్యశాఖలో 1326 డాక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్విడుదల చేసింది. వీటిలో డైరెక్టర్ఆఫ్పబ్లిక్హెల్త్విభాగంలో 751, డైరెక్టర్ఆఫ్మెడికల్ఎడ్యుకేషన్పరిధిలో 357, తెలంగాణ వైద్య విధాన పరిషత్పరిధిలో 211, ఐపీఎంలో 7 డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలనుకున్నది. తర్వాత డైరెక్టర్ఆఫ్మెడికల్ఎడ్యుకేషన్విభాగంలోని 357 ట్యూటర్పోస్టులను తర్వాత భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం రివైజ్డ్నోటిఫికేషన్ఇచ్చింది. ప్రస్తుతం 969 పోస్టుల భర్తీ ప్రాసెస్సాగుతున్నది.