ITBP Recruitment: భారీ జీతంతో ఐటీబీపీలో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఖాళీలు, అర్హత, జీతం వివరాలివే..!

కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) టెలికమ్యూనికేషన్(Telecommunication) విభాగంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2024-11-08 17:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) టెలికమ్యూనికేషన్(Telecommunication) విభాగంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 526 ఎస్సై(SI), హెడ్ కానిస్టేబుల్(Head Constable) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://itbpolice.nic.in/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 15న ప్రారంభమై డిసెంబర్ 14 వరకు కొనసాగనుంది. ఈ పోస్టులకు పురుషులతో పాటు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు.

పోస్టు పేరు, ఖాళీలు:

ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ - 526

విద్యార్హత:

పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్మీడియట్ ఉతీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

ఎస్సై పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 20-25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, సర్టిఫికట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తారు.

జీతం:

ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400-1,12,400, హెడ్ కానిస్టేబుల్ పే స్కేల్ రూ.25,500-81,100గా ఉంది.

Tags:    

Similar News