Indian Coast Guard: డిగ్రీ అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు, జీతం వివరాలివే..!
భారత రక్షణ మంత్రిత్వ శాఖ(Ministry of Defense)కు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: భారత రక్షణ మంత్రిత్వ శాఖ(Ministry of Defense)కు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 140 అసిస్టెంట్ కమాండెంట్(Assistant Commandant) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన పురుష అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://joinindiancoastguard.cdac.in ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 24 డిసెంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
- జనరల్ డ్యూటీ(GD) - 110
- టెక్నికల్(Technical) - 30
విద్యార్హత:
పోస్టును బట్టి ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
1 జులై 2025 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4, స్టేజ్-5 ఎగ్జామ్స్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 జీతం ఉంటుంది.