Union Bank Jobs: యూనియన్ బ్యాంక్ లో..భారీ ఖాళీలు!
ముంబై లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్ - యూబీఐ శాఖల్లో అప్రెంటిస్ ల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
దిశ, వెబ్ డెస్క్: ముంబై లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్ - యూబీఐ శాఖల్లో అప్రెంటిస్ ల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం అప్రెంటిస్ ఖాళీలు: 500
రిజర్వేషన్స్ పరంగా వేకెన్సీస్: యూఆర్ - 248, ఎస్సీ - 64, ఎస్టీ - 32, ఓబీసీ - 115, ఈడబ్ల్యూఎస్ - 41
- ఆంధ్రప్రదేశ్ లో - 50 ఖాళీలు
- తెలంగాణలో - 42 ఖాళీలు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం
స్టైపెండ్: నెలకు రూ. 15000
ఎంపిక: ఆన్ లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా..
దరఖాస్తు రుసుము; జనరల్/ఓబీసీ లకు రూ.800. ఎస్సీ/ఎస్టీ/ మహిళలకు రూ.600; దివ్యాంగులకు రూ.400.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-09-2024
వెబ్ సైట్: http://www.unionbankofindia.co.in/