ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఏమిటి..??
రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. Important bits related to polity
*రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది.
*రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాల వివాదాలను ఎన్నికల సంఘం పరిష్కరిస్తుంది.
*పార్టీ పిరాయింపులను నిషేదిస్తూ 1985లో రాజ్యంగ సవరణ చేశారు.
*ప్లోర్ క్రాసింగ్ అనగా సభ్యుడు ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించడం
*పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.
*పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం లోక్ సభ సభ్యుడి అనర్హత విషయంలో తుది నిర్ణయం లోక్ సభ స్పీకర్ కు ఉంటుంది.
*హంగ్ పార్లమెంట్ అంటే ఎన్నికల్లో తగినంత మెజారిటీ రాకపోవడం
*ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే భావన అమెరికా నుంచి తీసుకున్నాం
*జాతీయ సమైక్యతా మండలి ఏర్పాటు చేసిన సంవత్సరం 1961
*వృద్దాప్య ఫించన్లు, నిరుద్యోగ భృతి గురించే తెలిపే ఆర్టికల్ 41
*అంతరాష్ట్ర మండలి సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు.
*రాజ్యం నిర్వచనం గురించే తెలిపే ఆర్టికల్ 12
*లోక్ అదాలత్ అంటే ఒక అనియత న్యాయ నిర్ణయ సంస్థ
*భారత్ దేశాన్ని సంక్షేమ రాజ్యంగా తెలిపే ఆర్టికల్ 38
*బల్వంతా మెహతా రాయ్ కమిటీ 1957లో నియమంచారు.
*మొట్టమొదటిసారి మండలపంచాయితీ కమిటీలను ఏర్పాటు చేయాలని పేర్కొన్న కమిటీ అశోక్ మెహతా కమిటీ
*స్థానిక స్వపరిపాలన ముఖ్య ఉద్దేశ్యం ప్రజాస్వామిక వికేంద్రీకరణ
*పంచాయితీ రాజ్ పితామహుడు- బల్వంతారాయ్ మెహతా
*రాజ్యంగంలో 73వ సవరణ ద్వారా చేర్చిన షెడ్యూల్- 11
*74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వచ్చింది
*గ్రామపంచాయితీల గురించి తెలిపే ఆర్టికల్ -40
*స్థానిక ప్రభుత్వాల గురించి రాష్ట్ర జాబితాలో ఉంటుంది.
*కేంద్ర పాలిత ప్రాంత పాలకుడిని లెఫ్టినెంట్ గవర్నర్ అని అంటారు.
*భారతీయులు విదేశీ బిరుదులు స్వీకరించాలంటే రాష్ట్రపతి అనుమతి అవసరం
*ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ గురించి తెలిపే ఆర్టికల్-311