భారత్ లోక్ సభ పితామహుడని ఎవరని అంటారు..??
లోక్ సభ మొత్తం సభ్యుల సంఖ్యImportant bits related to Lok Sabha
*లోక్ సభ మొత్తం సభ్యుల సంఖ్య- 545
*లోక్ సభకు పోటీ చేయడానికి కావల్సిన కనీస వయస్సు- 25 సంవత్సరాలు
*లోక్ సభ, రాజ్యసభకు పేర్లను సూచించింది- జివి మౌలాంకర్
*లోక్ సభలో ఒక రాష్ట్రానికి సీట్లు జనాభా ఆధారంగా కేటాయిస్తారు.
*అత్యధిక లోక్ సభ స్థానాలు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్
*లోక్ సభ రద్దు అయిన రద్దు కాని లోక్ సభ పదవి- లోక్ సభ స్పీకర్
*లోక్ సభలో ఒకే ఒక స్థానం గల రాష్ట్రాలు- మిజోరం, నాగాలాండ్, సిక్కిం
*ఢిల్లో 7 లోక్ సభ, 3 రాజ్యసభ స్థానాలున్నాయి.
*పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక హక్కుల గురించి తెలిపే ఆర్టికల్ - 105
*అతి తక్కువ కాలం పని చేసిన లోక్ సభ- 12వ లోక్ సభ
*85వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి లోక్ సభను రద్దు చేయవచ్చు.
*లోక్ సభలో మొదటిసారిగా 1963 లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
*లోక్ సభలో మొదటి ప్రతిపక్ష నాయకుడు- వైబి చవాన్
*లోక్ సభలో మెజార్టీ పార్టీ నాయకుడు- ప్రధానమంత్రి
*లోక్ సభ పదవీకాలం ఒక పర్యాయం 1సంవత్సరం వరకు పొడగించవచ్చు.
*లోక్ సభ కార్యాలయం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది.
*లోక్ సభ కాలపరిమితిని 5 నుంచి 6 సంవత్సరాలకు పొడగించిన సవరణ- 42 వ రాజ్యాంగ సవరణ
*44వ రాజ్యంగ సవరణ ద్వారా లోక్ సభ కాలపరిమితిని 6 నుంచి 5 సంవత్సరాలకు తగ్గించారు.
*లోక్ సభ, రాజ్యసభ కనీసం రెండు సార్లు సమావేశం కావాలని తెలిపే ఆర్టికల్ - 85
*లోక్ సభలో షెడ్యూల్ కులాలకు, తెగలకు కేటాయించిన సీట్ల సంఖ్య: 84, 47
*లోక్ సభ, శాసనసభలో రోజు వారీ కార్యక్రమాల ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతాయి.
*లోక్ సభ సెక్రటరీ జనరల్ ను స్పీకర్ నియమిస్తాడు.
*లోక్ సభ కార్యాలయం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది.
*భారత్ లోక్ సభ పితామహుడని జి.వి మౌలాంకర్ ని అంటారు.
*కోరం గురించే తెలిపే ఆర్టికల్ - 100
*లోక్ సభలో సభ్యుడు గరిష్టంగా 5 ప్రశ్నలు అడగవచ్చు.
*సమావేశం వాయిదా పడినప్పుడు అప్పటికే ప్రవేశపెట్టిన బిల్లులు తర్వాత సమావేశంలో తీసుకుంటారు.
*రాజ్యాంగంలో 3వ షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు.
*కేంద్ర ప్రభుత్వ ఖర్చులపై నియంత్రణాధికారం లోక్ సభకు ఉంటుంది.
*పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనగా సభా కార్యకలాపాలు నియమాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు సభ్యులు లేవనెత్తిన ఆక్షేపణలు
*లోక్ సభ డిసాల్వ్ కావడం అనగా లోక్ సభ రద్దు కావడం
*లోక్ సభ సెక్రటేరియట్ లోక్ సభ పర్యవేక్షణలో ఉంటుంది.
*లోక్ సభ ఆమోదించిన ద్రవ్యబిల్లును రాజ్యసభ తిరస్కరించినపుడు లోక్ సభ రెండో సారి ఆమోదించాలి.
*లోకసభను అడ్జర్న్ చేసేది- స్పీకర్
*లోక్ సభ రాష్ట్రపతి చే రద్దు చేయబడుతుంది.