HAL: ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
దేశంలోని ప్రభుత్వరంగ సంస్థ, హైదరాబాద్(Hyderabad)లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రభుత్వరంగ సంస్థ, హైదరాబాద్(Hyderabad)లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 17 ఎగ్జిక్యూటివ్ పోస్టుల(Executive posts)ను షార్ట్ టర్మ్(Short Term) ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.hal-india.co.in/home ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 24, 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
- సీఎంఎం ఇంజనీర్ - 4
- మిడిల్ స్పెషలిస్ట్ - 8
- జూనియర్ స్పెషలిస్ట్ - 5
విద్యార్హత:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు.. పని చేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
సీఎంఎం ఇంజనీర్ పోస్టుకు 45 ఏళ్లు, మిడిల్ స్పెషలిస్ట్ పోస్టుకు 40 ఏళ్లు, జూనియర్ స్పెషలిస్ట్ పోస్టుకు 35 ఏళ్లకు మించి ఉండకూడదు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
జీతం:
సీఎంఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000, మిడిల్ స్పెషలిస్ట్ పోస్టుకు రూ. 50,000, జూనియర్ స్పెషలిస్ట్ పోస్టుకు రూ. 40,000 వరకు జీతం ఉంటుంది.