గ్రూప్ -2,3,4..S I, కానిస్టేబుల్ స్పెషల్ జాగ్రఫీ: గంగానది వ్యవస్థ
గంగానది మొత్తం పొడవు- 2,525 కి.మీ.
గంగానది మొత్తం పొడవు- 2,525 కి.మీ.
ప్రవహించే దేశాలు- భారత్, బంగ్లాదేశ్
భారతదేశంలో పొడవు- 2,510 కి.మీ.
జన్మస్థలం: గంగానది భగీరథి, అలకనంద నదుల కలయిక వల్ల జన్మించింది.
భగీరథి జన్మస్థలం- గంగోత్రి హిమానీనదం (ఉత్తరాఖండ్)
అలకనంద జన్మస్థలం- అలకపురి హిమానీనదం (ఉత్తరాఖండ్)
అలకనంద, భగీరథి అనే రెండు నదులు దేవప్రయాగ (ఉత్తరాఖండ్) వద్ద కలిసి గంగానదిగా ఏర్పడి అక్కడి నుంచి సుమారు 280 కి.మీ. అంతర్భూభాగ నదిగా ప్రవహిస్తూ హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.
ఈ నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ (జార్ఖండ్), పశ్చిమబెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఫరక్కా ప్రాజెక్టు వద్ద రెండు పాయలుగా విడిపోతుంది.
ఒక పాయ పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలోకి ప్రవేశింస్తుంది. దీనిని హుగ్లీ నది అని (రాజమహల్ కొండల వద్ద గంగానది – హుగ్లీ నది) (భగీరథి)
రెండో పాయ బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. దీన్ని పద్మానది అని అంటారు.
బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించిన పద్మానది గొలుండ్ వద్ద జమునా నదితో (బ్రహ్మపుత్ర) కలిసి మేఘన నదిగా ప్రవహిస్తూ డాఖిన్‌షా బాజ్‌పూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
గంగానది ఉపనదులు
యమున (ఉత్తరప్రదేశ్), సోన్ (బీహార్), దామోదర్ (పశ్చిమ బెంగాల్) – ఇవి కుడివైపు నుంచి, దక్షిణ దిక్కు నుంచి గంగానదిలో కలిసే ఉప నదులు
రామ్‌గంగా, గోమతి, భాగమతి (ఉత్తరప్రదేశ్), గండక్, కోసి, ఘాగ్రా, కాలి (బీహార్)- ఇవి ఎడమ వైపు నుంచి, ఉత్తర దిక్కు నుంచి గంగానదిలో కలిసే ఉపనదులు.
ప్రాముఖ్యత :
ఇది దేశంలో పొడవైన నది. అధిక నీటి పరిమాణంతో ప్రవహించే రెండో పెద్ద నది.
గంగానది అతి తరుణ నది (యవ్వన నది), భారతదేశ విస్తీర్ణంలో 26.3 శాతం భూభాగాన్ని పరీవాహక ప్రాంతంగా అత్యధికంగా కలిగి ఉంది.
గంగానది పరీవాహక ప్రాంతం మనదేశంలో 8,61,404 చ.కి.మీ.గా ఉంది.
గంగానది పరీవాహక ప్రాంతంలో సుమారు 40 కోట్ల జనాభా నివసిస్తున్నారు.
గంగ, యుమన, సరస్వతి నదులు కలిసి అలహాబాద్ వద్ద త్రివేణిసంగమం ఏర్పడినది.
2008 నవంబర్ 4న గంగానదిని జాతీయ నదిగా ప్రకటించారు.
- చిత్ర ఆనంద్ కుమార్ , సీనియర్ ఫ్యాకల్టీ..హైదరాబాద్.
యమునా నది
పొడవు: 1376 కి.మీ.
జన్మస్థలం: ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి హిమానీనదం వద్ద ఉన్న బండార్ పుంచ్ శిఖరం
మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం- తజేవాలా (ఉత్తరాఖండ్)
ఈ నది ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల గుండా ప్రవహిస్తూ యూపీలోని అలహాబాద్ (ప్రయాగ) వద్ద గంగానదిలో కలుస్తున్నది.
అలహాబాద్ వద్ద సరస్వతి నది కూడా కలుస్తున్నది. దీనినే త్రివేణి సంగమం అంటారు. గంగా నది ఉప నదుల్లో కెల్లా యమునా నది పొడవైనది.
ఇక్కడ ప్రతి 144 ఏండ్లకోసారి (అలహాబాద్) మహాకుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి 12 ఏండ్లకోసారి కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళా ఉత్సవాలు జరిగే ప్రదేశాలు
1. అలహాబాద్ (ఉత్తరప్రదేశ్)
2. హరిద్వార్ (ఉత్తరాఖండ్)- గంగా నదిపై
3. నాసిక్ (మహారాష్ట్ర)- గోదావరి నదిపై
4. ఉజ్జయిని (మధ్యప్రదేశ్)- శిప్రానదిపై
యుమునా నది ఉప నదులు: చంబల్, బెట్వా, క్రేన్. ఈ మూడు నదుల కలయికను కౌఠీలా అంటారు.
చంబల్ నది: ఇది మధ్యప్రదేశ్‌లోని జనపావో కొండల్లో గల మౌ అనే ప్రదేశంలో జన్మిస్తుంది.
బెట్వా నది: ఇది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపాన ఉన్న కైమూర్‌కొండల్లో జన్మిస్తుంది. దీన్ని నేత్రావతి నది అని కూడా పిలుస్తారు.
కెక్ నది: ఇది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపాన ఉన్న కైమూర్ కొండల్లో జన్మిస్తుంది. దీన్ని కర్ణావతి నది అని కూడా పిలుస్తారు.
ఈ మూడు నదులు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు, చంబల్ లోయ, రాజస్థాన్ గుండా ప్రవహిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఎటోవా జిల్లాలో యమునా నదిలో కలుస్తుంది. తర్వాత ఆ నది యమునా నదిగా ప్రవహిస్తూ అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.
దామోదర నది
చోటానాగపూర్ పీఠభూమిలోని టోరి వద్ద జన్మించి, రాజమహల్ కొండలను చీల్చుకుంటూ వాటి పగులు లోయల గుండా ప్రవహిస్తూ పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నదిలో కలుస్తుంది.
దీన్ని బెంగాల్ దుఃఖదాయని అని పిలుస్తారు. దీని ఉపనదులు బార్కార్, కోనార్.
3. గండక్ నది: ఇది నేపాల్‌లోని ఎవరెస్ట్, ధవళగిరి శిఖరాల మధ్య జన్మించి బీహార్‌లో గంగానదిలో కలుస్తుంది. దీన్ని నేపాల్‌లో సాలగ్రామి అని, బీహార్‌లో నారాయణి అని పిలుస్తారు.
4. కోసినది: దీన్ని సంస్కృతంలో కౌసికి అంటారు. ఇది నేపాల్, టిబెట్, సిక్కిం ప్రాంతాల సరిహద్దుల్లో జన్మిస్తుంది. ఇది బీహార్‌లో గంగానదిలో కలుస్తుంది.
కోసిని ప్రారంభంలో సప్త కోసి అని పిలిచేవారు. వీటిలో ముఖ్యమైనవి అరుణ్‌కోసి, తుమార్‌కోసి, సన్‌కోసి. దీన్ని (కోసినది) బీహార్ దుఃఖ దాయని అని పిలుస్తారు.