జనరల్ నాలెడ్జ్ (GK): నదీ వ్యవస్థ
సింధు నది (ఇండస్ నది) ఇది టిబెట్‌లోని కైలాస్ వరుసలో మానస సరోవరం వద్ద పుట్టింది.
సింధు నది (ఇండస్ నది)
* ఇది టిబెట్‌లోని కైలాస్ వరుసలో మానస సరోవరం వద్ద పుట్టింది.
* అక్కడి నుండి పశ్చిమానికి ప్రవహించి, జమ్మూ-కాశ్మీర్‌ని దాటి.. పాకిస్థాన్‌లో ప్రయాణించి తర్వాత అరేబియా సముద్రంలో కరాచీ వద్ద కలుస్తుంది.
* ఈ నది మొత్తం పొడవు - 2880 km
ఇందులో మన దేశంలో జమ్మూ కాశ్మీర్‌లో 709km ప్రయాణిస్తుంది.
* ఈ సింధూనది జమ్మూ కాశ్మీర్‌లో నంగ ప్రభాత్ పర్వతాన్ని తాకుతూ వెళ్తుంది.
* ఈ సింధు నదికి కుడి వైపున ఉన్న ఉపనదులు వరుసగా
1. జీలం
2. చీనాబ్.
3. రావి.
4. బియాస్
6. సట్లేజ్
1. జీలం నది:
* ఇది జమ్మూ - కాశ్మీర్‌లో పిర్‌పంజాల్ వరుసలో పుట్టి పశ్చిమానికి వెళ్ళి
పాకిస్తాన్‌లో సింధూలో కలిసింది.
2. చీనాబ్ నది:
* ఇది హిమాచల్ ప్రదేశ్‌లో బారాలాచా లా కనుమల్లో పుట్టి పాకిస్తాన్
సింధూ నదిలో కలిసింది.
ఇది సింధు ఉపనదుల్లో కెల్లా పెద్ద ఉపనది
3. రావి నది:
* ఇది కూడా హిమాచల్ ప్రదేశ్‌లో కులూ కనుమలులో పుట్టి పాకిస్తాన్‌లో లాహోర్ నగరం గుండా ప్రయాణించి, సింధూ నదిలో కలుస్తుంది.
* అందువల్ల రావి నదిని లాహోర్ నది అని కూడా అంటారు.
4. బియాస్ నది:
* ఇది కూడా హిమాచల్ ప్రదేశ్‌లో కులూ కనుమలో పుట్టి.. ఇది పాకిస్తాన్ గుండా వెళ్ళని సింధూ ఉపనది.
* ఇది సట్లేజ్ నదిలో పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో హరికే అనే ప్రాంతంలో కలుస్తుంది.
5. సట్లెజ్ నది:
* ఇది మన దేశంలో పుట్టని సింధు ఉపనది.
* టిబెట్‌లోని కైలాస్ శ్రేణిలో లోయ వద్ద పుట్టి మన దేశం గుండా వెళ్తూ.. బియాస్ నదిని కలుపుకొని పాకిస్తాన్‌లోకి వెళ్ళింది.
* సట్లెజ్ నది సింధు ఉపనదుల్లో కెల్లా పొడవైన ఉపనది.
బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ:
* ఇది కూడా టిబెట్ కైలాస్ శ్రేణిలో మానస సరోవరానికి దగ్గర్లో ఉన్న చమయంగ్ డాంగ్మ్ అనే ప్రాంతంలో పుట్టి తూర్పుకు ప్రవహించుకుంటూ వెళ్ళి.. మనదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రెండు రాష్ట్రాలు దాటిన తర్వాత బంగ్లాదేశ్‌లోకి ప్రవేసిస్తుంది.
* ఈ నది మొత్తం పొడవు - 2900km.
* ఇందులో మన దేశంలో రెండు రాష్ట్రాల్లో 885 km ప్రయాణిస్తుంది.
ఈ నది బంగ్లాదేశ్ లో ప్రవేశించగానే జమున నదిగా పిలువబడుతుంది.
పద్మానదితో కలిసిన తర్వాత మేఘన నదిగా పిలువబడుతుంది..
బ్రహ్మపుత్ర నదికి వివిధ పేర్లు:
టిబెట్‌లో- యార్లాంగ్ త్సాంగ్‌పో (టిబెట్ భాషలో శుద్ధి చేసేవాడు అని అర్థం.
అరుణాచల్‌ప్రదేశ్- దిహంగ్
అసోం- సైడంగ్
బంగ్లాదేశ్- జమున (పద్మా నదితో కలవక ముందు)
బంగ్లాదేశ్‌లో గంగానది (పద్మానది)తో కలిసిన తర్వాత (రెండింటినీ కలిపి)- మేఘన
చైనా- యార్లాంగ్ జాంగ్‌బో జియాన్‌జిన్
ఇండియా- రెడ్ రివర్
బ్రహ్మపుత్ర ఉపనదులు:
బ్రహ్మపుత్ర నదికి ఉత్తరాన కలిసే ఉపనదులు: తీస్తా, మానస, గంగాధర్, బేల్‌సిరి, ధరణ్‌సిరి, సుభనసిరి
దక్షిణం వైపు నుంచి కలిసే ఉపనదులు: దిబ్రూ, డిక్కు, దిహంగ్
పర్వతీయ నది: రాగాత్సాంగ్‌పో
బ్రహ్మపుత్ర నదికి అసోం దుఃఖదాయని అనే పేరు ఉంది. (ఇది దిశను మార్చుకుని భయంకర వరదతో ప్రవహిస్తుంది)
బ్రహ్మపుత్ర నది చైనా, ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య వివాదాస్పదమైనది.
ఈ నది అసోంలో మాజోలి అనే ద్వీపాన్ని ఏర్పర్చింది. దీని విస్తీర్ణం 1250 చ.కి.మీ.
ఇది ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం.
ఈ నది పరీవాహక ప్రాంతంలోని జోర్హాట్ జిల్లాలో కజిరంగా నేషనల్ పార్క్ (1905 – 2005 వందేండ్లు పూర్తి) ఉంది. ఇది ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి.
బ్రహ్మపుత్ర నది S ఆకారంలో ప్రవహిస్తుంది.
- చిత్ర ఆనంద్ కుమార్, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.