DRDO Recruitment: డీఆర్డీవోలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగ అవకాశాలు.. అర్హత, జీతం వివరాలివే..!
హైదరాబాద్(HYD)లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) అనుబంధ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబోరేటరీ(DARL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్(HYD)లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) అనుబంధ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబోరేటరీ(DARL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీగా ఉన్న 05 జూనియర్ రీసెర్చ్ ఫెలో(Junior Research Fellow) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.drdo.gov.in/drdo/ ద్వారా ఆన్లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 19 నవంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
జూనియర్ రీసెర్చ్ ఫెలో - 05
విద్యార్హత:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ ఎంటెక్, PHD ఉత్తీర్ణతతో పాటు.. పని చేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
28 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
విద్యార్హతలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి, రెండో సంవత్సరం నెలకు రూ. 37,000, ఆ తర్వాత నుంచి రూ. 42,000 వరకు జీతం ఉంటుంది.