సీయూయూటీ యూజీ ఫలితాలు విడుదల
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సీయూయూటీ యూజీ ఫలితాలు విడుదల అయ్యాయి.
దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సీయూయూటీ యూజీ ఫలితాలు విడుదల అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాలను విడుదల చేయగా.. ఈ విషయాన్ని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మొత్తం 11.11 లక్షల మంది పరీక్ష రాయగా.. మొత్తం 22 వేల మంది 100 పర్సంటైల్ సాధించారు. అత్యధికంగా ఇంగ్లీష్ లో 5685 మంది 100 పర్సంటైల్ సాధించారు. 4,850 మంది బయాలజీ/బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీలో టాప్ మార్కులు సాధించగా.. ఎకనామిక్స్ లో 2,836 మంది టాప్ లో నిలిచారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సాధనా పరాశర్ చెప్పారు. రిజల్ట్స్ కోసం అభ్యర్థులు cuet.samarth.ac.in సంప్రదించవచ్చు.