క్యాన్సర్ రక్కసి.. దాతల కోసం ఎదురుచూపులు!
దిశ, మధిర: అసలే కటిక పేదరికం. రెక్కాడితే కానీ డొక్కాడని నేపథ్యం వారిది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను బంధువులు పెంచి పెద్ద చేసి పెళ్లిచేశారు. భర్త కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు. అంతా బాగానే ఉందనుకునేలోపు ప్రాణాంతక వ్యాధి తనను తొలచివేస్తుందని ఆ వివాహిత పసిగట్టలేకపోయింది. తీరా విషయం తెలిసే సరికి చాలా ఆలస్యమైంది. ఆపరేషన్ చేస్తే గానీ కష్టమంటున్నారు వైద్యులు. కుటుంబ నేపథ్యం చూస్తేనేమో చాలా పూర్. ఇలాంటి […]
దిశ, మధిర: అసలే కటిక పేదరికం. రెక్కాడితే కానీ డొక్కాడని నేపథ్యం వారిది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను బంధువులు పెంచి పెద్ద చేసి పెళ్లిచేశారు. భర్త కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు. అంతా బాగానే ఉందనుకునేలోపు ప్రాణాంతక వ్యాధి తనను తొలచివేస్తుందని ఆ వివాహిత పసిగట్టలేకపోయింది. తీరా విషయం తెలిసే సరికి చాలా ఆలస్యమైంది. ఆపరేషన్ చేస్తే గానీ కష్టమంటున్నారు వైద్యులు. కుటుంబ నేపథ్యం చూస్తేనేమో చాలా పూర్. ఇలాంటి పరిస్థితుల్లో ఏంచేయాలో తోచక ఆర్థిక సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు ఆ దంపతులు.
వివరాల్లోకివెళితే.. ఖమ్మం జిల్లా మధిర ఎస్సీ కాలనీ చెందిన పేర్లెలి సునీత చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయింది. బంధువులే పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారు. ప్రస్తుతం వారి అమ్మమ్మ వాళ్లింట్లోనే ఉంటూ దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సునీత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్య పరీక్షల అనంతరం క్యాన్సర్ వ్యాధి అని తేలింది. ట్రీట్మెంట్ కోసం తన వద్ద ఉన్న డబ్బులతో పాటు బంధువుల సాయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకుంది.
దాంతో పాటు గొంతు( స్వరం పేటిక) అన్నం తినే పేగు మడతపడటం వలన ఆహారం తీసుకోవడం గానీ, మాట్లాడటంగానీ చేయలేని పరిస్థితి. అందుకోసం ఎండోస్కోపి మూడు సార్లు చేయించి వైద్యం చేయించాల్సి ఉంటుంది. ఎండోస్కోపీ ఆరోగ్యశ్రీ కింద రాదని డాక్టర్స్ తెలిపారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వీరిది. ఇప్పటివరకు నానమ్మ, బంధువులు చేసిన సాయంతో పాటు, వస్తువులను అమ్మి ఆ డబ్బుతో ట్రీట్మెంట్ తీసుకున్నారు. గొంతు,పేగు మడత సంబంధించి వైద్యం కొరకు ఆర్థిక సాయం కోసం ఆశిస్తోంది. ఎవరైనా దాతలు వైద్యానికి సాయం చేస్తే , తన పిల్లల జీవితానికి భరోసా కల్పించిన వారవుతారని బాధితురాలు సనీత వేడుకుంటోంది.