జూమ్ కాల్ లో నగ్నంగా నిలబడిన ఎంపీ.. ఎందుకో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్:ఈ కరోనా పుణ్యమా అని.. హోటల్స్, హాస్పిటల్స్ అయ్యాయి.. ఇల్లు ఆఫీస్ అయ్యింది.. డైనింగ్ హాల్ .. మీటింగ్ హాల్ గా మారింది. బయటికి వెళ్లకుండా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి జూమ్ కాల్ ఎంతో ఉపయోగపడింది. ఐతే ఈ జూమ్ కాల్ వలన చాలామంది సమస్యలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఇంటి దగ్గరే ఉంటున్నాం కదా.. రెడీ అవ్వడం అవసరమా అనుకున్నడమో ఒక ఎంపీ జూమ్ కాల్ లో నగ్నంగా కనపడి అందరిని షాక్ […]
దిశ, వెబ్ డెస్క్:ఈ కరోనా పుణ్యమా అని.. హోటల్స్, హాస్పిటల్స్ అయ్యాయి.. ఇల్లు ఆఫీస్ అయ్యింది.. డైనింగ్ హాల్ .. మీటింగ్ హాల్ గా మారింది. బయటికి వెళ్లకుండా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి జూమ్ కాల్ ఎంతో ఉపయోగపడింది. ఐతే ఈ జూమ్ కాల్ వలన చాలామంది సమస్యలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఇంటి దగ్గరే ఉంటున్నాం కదా.. రెడీ అవ్వడం అవసరమా అనుకున్నడమో ఒక ఎంపీ జూమ్ కాల్ లో నగ్నంగా కనపడి అందరిని షాక్ కి గురిచేశాడు. ఈ వింత ఘటన కెనడాలో చేటుచేసుకుంది.
ప్రస్తుతం కెనడాలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా ఆ సమావేశాలను జూమ్ కాల్ లో ఏర్పాటు చేశారు. అందరు సమావేశంలో పాల్గొని సమీక్ష జరుపుతుండగా కెనడా పార్లమెంట్ కు చెందిన ఎంపీ విలియమ్ ఆమోస్ నగ్నంగా కనిపించాడు. ఈ అనుకోని సంఘటనతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా షాక్ అయ్యారు. ఈ విషయమై ఎంపీ వివరణ ఇచ్చారు. తానూ పొద్దునే జాగింగ్ కి వెళ్లానని, వచ్చేసరికి ఆలస్యమైందని, సమావేశానికి లేట్ అవుతుందేమోనని కాల్ కనెక్ట్ చేసి డ్రెస్ మార్చుకోబోయానని తెలిపారు. అంతలోనే కాల్ కనెక్ట్ అవ్వడంతో ఈ పొరబాటు జరిగిందని వివరించారు. తప్పు ఎవరిది అయినా పాపం ఎంపీ పరువు మాత్రం గంగలో కలిసిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ముందు వెనకా చూసుకోబడలా ఎంపీ గారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.