ఖమ్మం జిల్లా నేతల ఆలోచనే వేరప్పా..!

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : ‘హలో తమ్మీ.. నేను హైదరాబాద్ పోతున్న. అర్జెంట్ పని ఉంటే ఫోన్ జెయ్యి. లేకపోతే హైదరాబాద్ రండ్రి. కేటీఆర్ సార్ నాకు అక్కడి ప్రచార బాధ్యతలు అప్పగించిండు. జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయే వరకు రాను. పలానా హోటల్లో ఉంటా. మన కార్యకర్తలు నా కోసమొస్తే జర జెప్పు…’ ఇది ఖమ్మం జిల్లా నేతల అప్పగింతలు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల బాట పట్టిన ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు జిల్లాలో అందుబాటులో […]

Update: 2020-11-18 07:22 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం :
‘హలో తమ్మీ.. నేను హైదరాబాద్ పోతున్న. అర్జెంట్ పని ఉంటే ఫోన్ జెయ్యి. లేకపోతే హైదరాబాద్ రండ్రి. కేటీఆర్ సార్ నాకు అక్కడి ప్రచార బాధ్యతలు అప్పగించిండు. జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయే వరకు రాను. పలానా హోటల్లో ఉంటా. మన కార్యకర్తలు నా కోసమొస్తే జర జెప్పు…’ ఇది ఖమ్మం జిల్లా నేతల అప్పగింతలు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల బాట పట్టిన ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు జిల్లాలో అందుబాటులో ఉండనందున వారి కోసం వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తన అనుచరులకు పలు బాధ్యతలు అప్పగించి వెళ్లారు. జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బాల‌సానితో పాటు జిల్లా స్థాయి ముఖ్య నేత‌లంతా హైద‌రాబాద్‌కు త‌ర‌లివెళ్లారు. ఏ ఎమ్మెల్యే అపాయింట్‌మెంట్ కావాల‌న్నా ఎన్నిక‌ల త‌ర్వాతే దొరికేట్లుగా ఉందంటూ పార్టీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు వాపోతున్నారు.

మంత్రి నుంచి నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌ వరకు…

ఖ‌మ్మం జిల్లా గులాబీ నేత‌లు మంత్రి అజ‌య్‌కుమార్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌నున్నారు. మంత్రి అజ‌య్‌కుమార్‌కు కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను పార్టీ అప్ప‌గించిన విష‌యం తెలిసిందే. మంత్రి సూచ‌న‌ల మేర‌కు ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో డివిజ‌న్ కేటాయించినట్లు తెలుస్తోంది. స‌ద‌రు ఎమ్మెల్యేతో పాటు ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం ప్ర‌చారంలో చేయ‌నున్నారు. దీంతో ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని ముఖ్య నేత‌లతో పాటు నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌లు కూడా బ్యాగు స‌ర్దేసుకోవ‌డం గ‌మ‌నార్హం. దాదాపు 15రోజుల పాటు హైద‌రాబాద్‌లోనే మ‌కాం వేయాల‌ని ఎమ్మెల్యేల‌కు అధిష్ఠానం నుంచి ఆదేశాలు అంద‌డంతో ప్ర‌చార బాధ్య‌త‌లు చూసుకోవాల్సిన డివిజ‌న్ల‌కు స‌మీపంలోని స్టార్‌ హోట‌ళ్లు, వ్య‌వ‌సాయ క్షేత్రాలు, రిసార్టుల్లో ఉండేందుకు నాయ‌కులు ఏర్పాట్లు చేసిన‌ట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

మరి మేమూ గెలవాలిగా..

ప్ర‌చారానికి వెళ్తున్న కొంత‌మంది నేత‌ల్లో వ‌చ్చే ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్న వారు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌డం వ‌ల‌న అనుభ‌వం గ‌డించ‌డంతో పాటు అధిష్ఠానం పెద్ద‌ల దృష్టిలో ప‌డిన‌ట్ల‌వుతుంద‌న‌న్న దూరాలోచ‌న‌తో హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరుతుండ‌టం విశేషం. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే క‌నీసం వెయ్యి మందికి త‌క్కువ కాకుండా ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొనేలా ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవాల‌ని అధిష్ఠానం ఆదేశించిన‌ట్లు స‌మాచారం. త‌ద‌నుగుణంగానే ముఖ్య‌మైన నేత‌లు, మండ‌ల స్థాయి నేత‌లంద‌రూ ప్ర‌చారంలో పాల్గొనేలా ఆదేశించిన‌ట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News