కాంబోడియా బాంబ్ స్క్వాడ్‌లో కొత్త ఎలుకల బ్యాచ్

దిశ, ఫీచర్స్ : ల్యాండ్‌మైన్స్, ఇతరత్రా పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని డిస్పోజ్ చేసేందుకు బాంబ్ స్క్వాడ్ పేరుతో ట్రైన్డ్ ఆఫీసర్స్ ఉంటారన్న విషయం తెలిసిందే. అది అత్యంత రిస్క్‌తో కూడుకున్న జాబ్ కాగా.. ప్రజల రక్షణ కోసం వారి ప్రాణాలను పణంగా పెడుతుంటారు. ఈ మేరకు పేలుడు పదార్థాలను కనిపెట్టేందుకు శునకాలను కూడా ఉపయోగిస్తుంటారు. కానీ కాంబోడియా దేశంలో ఇందుకోసం ఎలుకలను వాడుకోవడం విశేషం. దశాబ్దాలుగా అన్‌ఎక్స్‌ప్లోడెడ్ ఆర్డినెన్స్(UXO)తో సతమతమవుతున్న ఆ దేశం.. డీమైనింగ్ ఆపరేషన్స్‌ […]

Update: 2021-06-14 03:29 GMT

దిశ, ఫీచర్స్ : ల్యాండ్‌మైన్స్, ఇతరత్రా పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని డిస్పోజ్ చేసేందుకు బాంబ్ స్క్వాడ్ పేరుతో ట్రైన్డ్ ఆఫీసర్స్ ఉంటారన్న విషయం తెలిసిందే. అది అత్యంత రిస్క్‌తో కూడుకున్న జాబ్ కాగా.. ప్రజల రక్షణ కోసం వారి ప్రాణాలను పణంగా పెడుతుంటారు. ఈ మేరకు పేలుడు పదార్థాలను కనిపెట్టేందుకు శునకాలను కూడా ఉపయోగిస్తుంటారు.

కానీ కాంబోడియా దేశంలో ఇందుకోసం ఎలుకలను వాడుకోవడం విశేషం. దశాబ్దాలుగా అన్‌ఎక్స్‌ప్లోడెడ్ ఆర్డినెన్స్(UXO)తో సతమతమవుతున్న ఆ దేశం.. డీమైనింగ్ ఆపరేషన్స్‌ పెంచడంలో భాగంగా ల్యాండ్‌మైన్స్ గుర్తించేందుకు గాను తాజాగా కొత్త జనరేషన్‌కు చెందిన ఎలుకలను సిద్ధం చేసింది.

ఈ ఆపరేషన్స్ కోసం కాంబోడియా రీసెంట్‌గా ఇరవై ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ఎలుకలను టాంజానియా నుంచి దిగుమతి చేసుకోగా.. ప్రస్తుతం అవి ట్రైనింగ్‌లో ఉన్నాయి. కాగా వాటితో పనిచేయడం చాలా సులభమని, తమ హ్యాండ్లర్స్(ఇన్‌స్ట్రక్టర్స్) ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోవని హ్యాండ్లర్స్‌లో ఒకరైన సో మలెన్ వెల్లడించారు. ప్రస్తుతం అతడు థాయ్‌లాండ్ బార్డర్‌లోని ప్రే విహార ప్రావిన్స్‌లో రిక్రూట్ అయిన ఏడు ఎలుకలకు శిక్షణనిస్తున్నాడు. ఇక కాంబోడియాలో దశాబ్దాల పాటు అంతర్యుద్ధం కొనసాగగా.. అక్కడి 1000 చ.కిమీ(621 చ.మైళ్లు) మేర భూభాగం భారీగా లాండ్‌మైన్లతో నిండిపోయి ప్రపంచంలోనే ఎక్కువ లాండ్‌మైన్స్ ఉన్న దేశంగా నిలిచింది. ఈ పేలుళ్ల కారణంగా సంవత్సరానికి 40000కు పైగా ప్రజలు తమ అవయవాలను కోల్పోతున్నారు.

ఇటీవల మగావా జాతి ఎలుకతో పాటు రిటైర్ అయిన ఇతర ఎలుకల స్థానంలో.. కొత్తగా రిక్రూట్ అయిన బ్యాచ్ సేవలందించనుంది. కాగా మగావా తన ఐదేళ్ల కెరియర్‌లో 71 లాండ్‌మైన్స్‌తో పాటు 38 UXOలను గుర్తించి గోల్డ్ మెడల్ సాధించిందని ఇంటర్నేషన్ ఆర్గనైజేషన్ APOPO తెలిపింది. ఈ సంస్థ లాండ్‌మైన్స్‌తో పాటు క్షయవ్యాధిని గుర్తించేందుకు ఎలుకలను ఉపయోగించడంలో ప్రత్యేకతను కలిగిఉంది. ఇక వాసన పసిగట్టడంలో ఎలుకలకు అద్భుతమైన శక్తి ఉంటుందని, ఆ ఫలితాలు కూడా ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయని చెప్పిన హ్యాండ్లర్ మలెన్.. మిగతా వాటితో పోలిస్తే మగావా ఎలుకను హీరోగా చెప్పొచ్చని తెలిపారు.

 

Tags:    

Similar News