ఈ-కామర్స్ నిబంధనల అమలుకు గడువు పొడిగింపు అక్కర్లే : సీఏఐటీ

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా ఈ-కామర్స్ నిబంధనలపై అభిప్రాయాలను సమర్పించేందుకు చివరి గడువును పొడిగించాలని పలు కంపెనీలు ప్రభుత్వాన్ని కోరినట్టు వచ్చిన నివేదికలను పరిశ్రమల సంఘం సీఏఐటీ వ్యతిరేకించింది. ఇలాంటి డిమాండ్లు అన్యాయమైనవని, పొడిగింపు అవసరం లేదని భారత వ్యాపారుల సమాఖ్య తెలిపింది. ‘ఈ-కామర్స్ నిబంధనల పొడిగింపు కొన్ని వ్యాపార సంస్థల స్వార్థ వ్యూహమే తప్ప మరోకటి కాదని’ సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. నిబంధనలు అమలు రాకెట్ సైన్స్ కాదని, సలహాలు అందించేందుకు […]

Update: 2021-07-04 10:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా ఈ-కామర్స్ నిబంధనలపై అభిప్రాయాలను సమర్పించేందుకు చివరి గడువును పొడిగించాలని పలు కంపెనీలు ప్రభుత్వాన్ని కోరినట్టు వచ్చిన నివేదికలను పరిశ్రమల సంఘం సీఏఐటీ వ్యతిరేకించింది. ఇలాంటి డిమాండ్లు అన్యాయమైనవని, పొడిగింపు అవసరం లేదని భారత వ్యాపారుల సమాఖ్య తెలిపింది. ‘ఈ-కామర్స్ నిబంధనల పొడిగింపు కొన్ని వ్యాపార సంస్థల స్వార్థ వ్యూహమే తప్ప మరోకటి కాదని’ సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. నిబంధనలు అమలు రాకెట్ సైన్స్ కాదని, సలహాలు అందించేందుకు ఎలాంటి దర్యాప్తు అవసరంలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, పరిశ్రమల సంఘం ఈ-కామర్స్ విభాగంలో విదేశీ పెట్టుబడిదారులు స్థానిక చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారని, దీనికోసం కఠినమైన నిబంధనలు డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. ప్రస్తుతం పరిస్థితుల్లో దేశీయ వ్యాపార రంగంలో శక్తివంతంగా మారుతున్న ఈ-కామర్స్ వ్యాపారాలపై కఠిన నిబంధనలు అవసరమని సీఏఐటీ వివరించింది.కాగా, ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థలు నిర్వహిస్తున్న ఫ్లాష్‌సేల్స్ నిషేధించబడతాయి. అంతేకాకుండా విదేశీ ఈ-కామర్స్ కంపెనీలు ఫిర్యాదుల కోసం పరిష్కార యంత్రాంగాన్ని నియమించాలి, అలాగే కంపెనీలో చీఫ్ కంప్లయెన్స్ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News