హ్యూండాయ్ ఆన్‌లైన్ విక్రయాలు!

దిశ, వెబ్‌డెస్క్: ఆటో దిగ్గజ కంపెనీ హ్యూండాయ్ ఈ ఏడాది జనవరిలో సరికొత్త ప్రాజెక్టు ప్రారంభించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ప్రయోగాత్మకంగా ‘క్లిక్ టు బై’ ద్వారా కార్ల ఆన్‌లైన్ బుకింగ్‌లకు అవకాశం ఇచ్చింది. తాజాగా దేశవ్యాప్తంగా 500 విక్రయ కేంద్రాలను ‘క్లిక్ టు బై’ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలిగా వెర్నా, న్యూ క్రెటా సహా హ్యూండాయ్ అన్ని రకాల మోడళ్లను వినియోగదారులు కార్లను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లకు ఫైనాన్స్ […]

Update: 2020-04-08 23:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆటో దిగ్గజ కంపెనీ హ్యూండాయ్ ఈ ఏడాది జనవరిలో సరికొత్త ప్రాజెక్టు ప్రారంభించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ప్రయోగాత్మకంగా ‘క్లిక్ టు బై’ ద్వారా కార్ల ఆన్‌లైన్ బుకింగ్‌లకు అవకాశం ఇచ్చింది. తాజాగా దేశవ్యాప్తంగా 500 విక్రయ కేంద్రాలను ‘క్లిక్ టు బై’ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలిగా వెర్నా, న్యూ క్రెటా సహా హ్యూండాయ్ అన్ని రకాల మోడళ్లను వినియోగదారులు కార్లను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లకు ఫైనాన్స్ పరమైన ఆప్షన్లను ఆన్‌లైన్‌లోనే కల్పించింది. కార్ల డెలివరీ విషయంలో కూడా కస్టమర్లదే ఎంపిక అని కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలను హ్యూండాయ్ మోటార్ ఇండియా ఎండీ వివరించారు.

Tags: Automobiles, HMIL, Hyundai Motor India Limited, India

Tags:    

Similar News