జొమాటోకు షాక్.. రూ.9.45 కోట్లు చెల్లించాలని నోటీసులు

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోకు ఇటీవల కాలంలో వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.

Update: 2024-06-30 12:16 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోకు ఇటీవల కాలంలో వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా సార్లు జీఎస్టీ నోటీసులు అందుకున్న కంపెనీ తాజాగా మరోసారి కర్ణాటకలోని అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్ (ఆడిట్) నుండి రూ.9.45 కోట్లకు సంబంధించిన నోటీసులను అందుకుంది. ఈ విషయాన్ని కంపెనీ BSE ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కర్ణాటక పన్ను నియంత్రణ సంస్థ జొమాటోను 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.9.45 కోట్ల జీఎస్టీ చెల్లించాలని తన నోటీసులో పేర్కొంది. వీటిలో రూ.5,01,95,462 అసలు, రూ.3.93 కోట్ల వడ్డీ, రూ. 50.19 లక్షల పెనాల్టీతో మొత్తం రూ. 9.45 కోట్లుగా ఉంది.

అయితే ఈ నోటీసులపై స్పందించిన జొమాటో, దీనిపై సంబంధిత అథారిటీ ముందు అప్పీల్‌ దాఖలు చేస్తామని పేర్కొంది. దేశీయంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో అగ్రగామిగా ఉన్న కంపెనీకి ఇలాంటి పన్ను నోటీసులు రావడం ఇది మొదటిసారి కాదు. 2021లో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ గురుగ్రామ్, అదనపు కమిషనర్ నుండి పన్ను నోటీసును అందుకుంది. వడ్డీ, పెనాల్టీ ఛార్జీలతో కలిపి రూ.11.82 కోట్లు చెల్లించాలని కంపెనీని కోరింది. అంతకుముందు మహారాష్ట్ర పన్ను విభాగం నుంచి జీఎస్టీ నోటీసులు అందుకుంది.


ఈ మూవీతో నాపై మీ అభిప్రాయం మారిపోతుంది.. సన్నీ లియోన్ కామెంట్స్ వైరల్  


Similar News