Warren Buffett: వారెన్ బఫెట్ వద్ద భారీగా నగదు నిల్వలు.. ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయంటే..!
ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హాథవే(Berkshire Hathaway) సంస్థ అధిపతి వారెన్ బఫెట్(Warren Buffett) వద్ద ప్రస్తుతం రూ.27.30 లక్షల కోట్ల నగదు ఉన్నట్లు తెలుస్తోంది.
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హాథవే(Berkshire Hathaway) సంస్థ అధిపతి వారెన్ బఫెట్(Warren Buffett) వద్ద ప్రస్తుతం రూ.27.30 లక్షల కోట్ల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు తో ముగిసిన త్రైమాసికంలో ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్(Apple)లోని 75 బిలియన్ డాలర్లకు పైగా షేర్లను విక్రయించడంతో తన ఖాతాకు ఆదాయం మరింత సమకూరింది. దీంతో యాపిల్‌లోని తన షేర్ల వాటా విలువ మరింత తగ్గింది. కాగా బెర్క్‌షైర్ సంస్థకు యాపిల్ షేర్లలో గత ఏడాది ఇదే సమయంలో 174.3 బిలియన్ డాలర్ల విలువైన వాటా ఉండగా.. ఈ ఇయర్ సెప్టెంబర్ నాటికి 69.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే ఈ ఏడాది యాపిల్‌తో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా(Bank of America) వంటి ప్రధాన కంపెనీల షేర్లను కూడా ఆ సంస్థ విక్రయించింది. అయితే షేర్లను సేల్ చేస్తున్న కూడా ఆ సంస్థ ఆదాయం మాత్రం పెద్దగా పెరగలేదు. గతేడాది కంపెనీ ఆదాయం 93.21 బిలియన్ డాలర్లుగా ప్రకటించిన బెర్క్‌షైర్ హాథవే ఈ సంవత్సరం 92.995 బిలియన్ డాలర్లు ఆదాయాన్ని నమోదు చేసింది.