UPI చెల్లింపు పరిమితి రూ.5 లక్షలకు పెంపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI లావాదేవీలపై కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-12-08 13:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI లావాదేవీలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం UPI ద్వారా రూ.1 లక్ష వరకు చెల్లించేందుకు అనుమతి ఉండగా, ఆ పరిమితిని రూ. 5 లక్షల వరకు పెంచుతున్నట్లుగా పేర్కొంది. అయితే ఈ లావాదేవీ పరిమితి విద్యాసంస్థలు, ఆసుపత్రులల్లో చెల్లింపులు చేసేటప్పుడు వర్తిస్తుంది. ఇక్కడ వైద్య ఖర్చులు, ఫీజులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ప్రజలు సులభంగా లావాదేవీలు నిర్వహించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

Tags:    

Similar News