ISB Hyderabad: ప్రపంచ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో మూడు ఐఐఎంలు, ఐఎస్‌బీ హైదరాబాద్‌కు చోటు

మన దేశం నుంచి ఎంపికైన మూడు ఐఐఎంలు ఉపాధికి సంబంధించిన విభాగంలో టాప్-50 జాబితాలో నిలిచాయి.

Update: 2024-09-25 19:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌కు చెందిన నాలుగు బిజినెస్ స్కూల్స్ ప్రపంచస్థాయి టాప్-100 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించాయి. ప్రముఖ క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ గ్లోబల్ జాబితా ప్రకారం.. టాప్-100లో భారత్ నుంచి ఐఐఎం బెంగలూరు, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కలకత్తాతో పాటు ఐఎస్‌బీ హైదరాబాద్ ర్యాంకులను సాధించాయి. మన దేశం నుంచి ఎంపికైన మూడు ఐఐఎంలు ఉపాధికి సంబంధించిన విభాగంలో టాప్-50 జాబితాలో నిలిచాయి. మూడు కొత్త ఎంట్రీలతో సహా భారత్‌కు చెందిన 14 ఫుల్‌టైమ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లు క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ఉన్నాయి. ఇక, ఇవి కాకుండా భారత్ నుంచి ఐఐఎం కోజికోడ్ 151-200 ర్యాంకుల్లో స్థానం దక్కించుకోగా, సోమయ్య విద్యా విహార్, ఐఐఎం ఘజియాబాద్ 250 ర్యాంకులపైన నిలిచాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు చెందిన స్టాన్‌ఫోర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వరుసగా ఐదవ సంవత్సరం బిజినెస్ స్కూల్స్ విభాగంలో అగ్రస్థానాన్ని సాధించింది.  

Tags:    

Similar News