Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. రూ. 6 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి..!
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారం మళ్లీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారం మళ్లీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్ల అమ్మకాల ఒత్తిడితో సోమవారం సూచీలు నష్టాల బాట పట్టాయి. అలాగే అమెరికాలో రేపు జరగనున్న ఎలక్షన్స్ ఎఫెక్ట్ కూడా మన స్టాక్ మార్కెట్ పై పడింది. ముఖ్యంగా ఈ రోజు మీడియా, చమురు, గ్యాస్ రంగాలలో భారీ క్షీణత లభించింది. దీంతో మదుపర్లు 6 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. సెన్సెక్స్(Sensex) ఉదయం 79,713.14 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలయ్యింది. ఇంట్రాడేలో 78,232.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 941.88 పాయింట్ల నష్టంతో 78,782.24 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 309 పాయింట్లు తగ్గి 23,995.35 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.08 దగ్గర ముగిసింది.
లాభాలో ముగిసిన షేర్లు : ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
నష్టపోయిన షేర్లు : అదానీ పోర్ట్స్, రిలయన్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, హీరో మోటోకార్ఫ్