RBI: ఏఐ వినియోగంపై ఫ్రేమ్‌వర్క్ రూపకల్పనకు ప్యానెల్ ఏర్పాటు చేసిన ఆర్‌బీఐ
ఈ కమిటీ ప్రపంచ ఆర్థిక రంగంపై దృష్టి సారించి ఏఐపై నియంత్రణ, పర్యవేక్షక విధానాలను కూడా సమీక్షిస్తుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బాధ్యతాయుతమైన, నైతికత కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గురువారం ప్రకటించింది. ఐఐటీ బొంబాయి ప్రొఫెసర్ పుష్పక్ భట్టాచార్య (డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) నేతృత్వంలోని ప్యానెల్ ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశంలోనూ ఆర్థిక సేవలలో ఏఐ ప్రస్తుత స్థాయిని అంచనా వేస్తుంది. ఈ కమిటీ ప్రపంచ ఆర్థిక రంగంపై దృష్టి సారించి ఏఐపై నియంత్రణ, పర్యవేక్షక విధానాలను కూడా సమీక్షిస్తుంది. అలాగే, ఏఐకి సంబంధించిన ప్రమాదాలను గుర్తించడం, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్, పీఎస్ఓలు సహా ఆర్థిక సంస్థలకు సహకారం, సవాళ్లను నివారించడం, పర్యవేక్షక ఫ్రేమ్‌వర్క్, అనుసరించాలని అంశాలను సిఫార్సు చేయనుంది. కమిటీలోని సభ్యులు తొలి సమావ్శం జరిగిన తర్వాత నుంచి ఆరు నెలల్లోగా తమ నివేదిక సమర్పిస్తాయని ఆర్‌బీఐ వెల్లడించింది.