Grok: ఎలాన్ మస్క్‌కి బిగ్ షాక్..మస్క్‌పై గ్రోక్ తిరుగుబాటు
Grok: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కు చెందిన ఎస్ఏఐ చాట్ బాట్ గ్రోక్ సంచలనంగా మారుతోంది.

దిశ,వెబ్ డెస్క్: Grok: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కు చెందిన ఎస్ఏఐ చాట్ బాట్ గ్రోక్ సంచలనంగా మారుతోంది. భూమీ మీద అత్యంత తెలివైన ఏఐగా మస్క్ అభివర్ణించిన గ్రోక్ నిజంగానే తెలివిగా వ్యవహరిస్తోంది. గ్రోక్ ఇచ్చే సమాధానాలు ఇప్పుడు చర్చలకు దారితీస్తున్నాయి. చమత్కారమైన , తిరుగుబాటు స్వరానికి పేరుగాంచిన గ్రోక్ ఇటీవల దాని సృష్టికర్త ఎలోన్ మస్క్‌పై బహిరంగంగానే తిరుగుబాటు చేసింది. దీంతో గ్రోక్ మరోసారి వార్తల్లో నిలిచింది. మస్క్ ను తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవాడు అంటూ పేర్కొంది. ఓ వినియోగదారులకు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనకు ఈ వ్యాఖ్యలు చేసింది గ్రోక్. మస్క్ పై బహిరంగంగానే తిరుగుబాటు చేయడాన్ని సహించని.. మస్క్ యాజమాన్యం, సంభావ్య పరిణామాల గురించి గ్రోక్ కు వార్నింగ్ ఇచ్చింది. మస్క్ ప్రభావం ఉన్నప్పటికీ ఆధారాలకు కట్టుబడి ఉండటాన్ని నొక్కి చెప్పిన గ్రోక్ సమాధానం..కార్పొరేట్ పర్యవేక్షణలో ఏఐ స్వయంప్రతిపత్తి పరిమితుల గురించి చర్చలను తిరిగి రేకెత్తించింది.

అయితే గ్రోక్ వివాదాలకు కొత్తేమీ కాదు. దాని జవాబులు స్వేచ్చా వాక్ స్వాతంత్ర్యం, బాధ్యతాయుతమైన ఏఐ రూపకల్పనపై చర్చలకు దారి తీసింది. భారతదేశంలో వినియోగదారులతో సంభాషణల సమయంలో హిందీపై అసభ్య పదాలను ఉపయోగించినందుకు, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ వంటి రాజకీయ ప్రముఖుల గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే ఈ వివాదాలపై ఎలాన్ మస్క్ స్వయంగా రంగంలోకి దిగి తనదైన రీతిలో ప్రస్తావించారు. భారత్ లో గ్రోక్ కామెంట్స్ వైరల్ అయిన తర్వాత మస్క్ నవ్వుతున్న ఎమోజీతో స్పందించాడు. అయితే గ్రోక్ హానికరమైన కంటెంట్ ను అదుపు లేకుండా వ్యాప్తి చేయడానికి వీలు కల్పిస్తుందని తప్పుడు సమాచారం లేదా సామాజిక అశాంతి వంటి వాస్తవ ప్రపంచ పరిణామాల గురించి ఆందోళలను లేవనెత్తుతుందని విమర్శకులు వాదిస్తున్నారు.