Economy: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 6.5 శాతం: ఆర్థిక శాఖ అంచనా

ప్రథమార్థం వృద్ధి నెమ్మదిగా ఉన్నప్పటికీ పూర్తి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మెరుగైన వృద్ధి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

Update: 2024-12-26 15:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన్ భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి 6.5 శాతంగా నమోదు కావొచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన మంత్లీ ఎకనమిక్ రివ్యూ ప్రకారం, ప్రథమార్థం వృద్ధి నెమ్మదిగా ఉన్నప్పటికీ పూర్తి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మెరుగైన వృద్ధి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ద్రవ్య విధాన వైఖరి ప్రథమార్థంలో మందగమనానికి కారణాలతో ఒకటని మంత్రిత్వ శాఖ తమ సమీక్షలో పేర్కొంది. జీడీపీ వృద్ధి రేటు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.4 శాతానికి పడిపోయింది. అధిక ద్రవ్యోల్బణం వల్ల ఆర్‌బీఐ వరుసగా 11వ సారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. పట్టణ వినియోగ వృద్ధి మందగించడానికి ప్రైవేట్ రంగ నియామకాలు తగ్గడం కూడా ఓ కారణమని నివేదిక పేర్కొంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోని మొదటి రెండు నెలల్లో గ్రామీణ, పట్టణ డిమాండ్ పుంజుకోవడంతో వృద్ధి అంచనా సానుకూలంగా కనిపిస్తోందని నివేదిక అభిప్రాయపడింది. వర్షాకాలం ముగియడం, ప్రభుత్వ మూలధన వ్యయంలో ఆశించిన పెరుగుదల సిమెంట్, ఇనుము, ఉక్కు, మైనింగ్, విద్యుత్ రంగాలకు మద్దతునిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Tags:    

Similar News