Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) వరుసగా నాలుగో రోజు లాభాల జోరు కొనసాగించాయి.

Update: 2024-12-04 11:06 GMT
Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
  • whatsapp icon

దిశ, వెబ్‌‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) వరుసగా నాలుగో రోజు లాభాల జోరు కొనసాగించాయి. గ్లోబల్ మార్కెట్ల(Global Market) నుంచి సానుకూల సంకేతాల ఉన్న .. నేడు ఆర్బీఐ గవర్నర్(RBI Governor) నేతృత్వంలో మానిటరీ పాలసీ కమిటీ(MPC) భేటీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ఈ రోజు(బుధవారం) తీవ్ర ఒడిదుడుకుల మధ్య మన బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఈ రోజు బ్యాంకింగ్‌(Banking), రియల్టీ(Reality) షేర్లు సూచీలకు అండగా నిలిచాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 81,036.22 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై ఇంట్రాడేలో 80,630.53 - 81,245 మధ్య కదలాడింది. చివరికి 110.58 పాయింట్ల లాభంతో 80,956.33 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) 10.30 పాయింట్లు లాభంతో 24,467 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.05 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.74కి చేరుకుంది.

లాభాల్లో ముగిసిన షేర్లు : బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,  టీసీఎస్, టైటాన్

నష్టాల్లో ముగిసిన షేర్లు : మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్

Tags:    

Similar News