Green Bonds: త్వరలో IFSCలో సావరిన్ గ్రీన్ బాండ్ల ట్రేడింగ్ స్టార్ట్: ఆర్‌బీఐ గవర్నర్

గుజరాత్‌ GIFT సిటీలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్‌(IFSC)లో సావరిన్ గ్రీన్ బాండ్లపై ట్రేడింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో ప్రారంభం అవుతుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం తెలిపారు

Update: 2024-08-10 14:39 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: గుజరాత్‌ GIFT సిటీలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్‌(IFSC)లో సావరిన్ గ్రీన్ బాండ్లపై ట్రేడింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో ప్రారంభం అవుతుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం తెలిపారు. ఒక సమావేశంలో మాట్లాడిన ఆయన, గ్రీన్ బాండ్లలో పెట్టుబడి, ట్రేడింగ్‌ను అనుమతించడంపై మేము ఐఎఫ్‌ఎస్‌సీతో చర్చిస్తున్నాము, 2024-25 ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌‌ కాలంలో ట్రేడింగ్ నిర్వహించుకునే అవకాశం రావచ్చని అన్నారు.

ప్రభుత్వం 2022-23 నుంచి గ్రీన్ బాండ్ల ద్వారా నిధులను సేకరిస్తోంది. గత రెండేళ్లలో మొత్తం రూ.36,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, సెప్టెంబర్ 2024తో ముగిసే ప్రస్తుత సంవత్సరం ప్రథమార్థంలో రూ. 12,000 కోట్ల లక్ష్యం పెట్టుకోగా దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం రూ. 1,697 కోట్లను సమీకరించిందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దేశంలో హరిత విప్లవానికి వాతావరణ ఫైనాన్స్ కోసం గ్రీన్ బాండ్ల ద్వారా నిధులను సేకరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కార్బన్ తీవ్రతను గణనీయంగా తగ్గించాలనే ఆశయానికి అనుగుణంగా, యూనియన్ బడ్జెట్ 2022-23 సావరిన్ గ్రీన్ బాండ్ల జారీని కేంద్రం ప్రకటించింది.

Tags:    

Similar News