Flipkart: ఫోన్‌పె బోర్డు నుంచి వైదొలగిన ఫ్లిప్‌కార్ట్ కో-ఫౌండర్ బిన్నీ బన్సాల్

2016 నుంచి కొనసాగుతున్న ఫోన్‌పే బోర్డు నుంచి కూడా నిష్క్రమించారు.

Update: 2024-11-22 13:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి వైదొలగిన తర్వాత కంపెనీ కో-ఫౌండర్ బిన్నీ బన్సాల్ తాజాగా డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే బోర్డు నుంచి కూడా వైదొలిగారు. బన్సాల్ తన కొత్త వెంచర్ ఆప్‌డోర్ ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది జనవరిలో ఫ్లిప్‌కార్ట్‌లో వైరుధ్యాల కారణంగా బయటకు వచ్చారు. తాజాగా 2016 నుంచి కొనసాగుతున్న ఫోన్‌పే బోర్డు నుంచి కూడా నిష్క్రమించారు. బిన్నీ బన్సాల్ బయటకు వెళ్లడంపై స్పందించిన ఫోన్‌పే సీఈఓ, ఫౌండర్ సమీర్ నిగమ్.. ఫోన్‌పే తొలినాళ్లలో ఎంతో మద్దతిచ్చిన బిన్నీ బన్సాల్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అతని నిర్ణయాలు, విధానాలు సంస్థ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని అన్నారు. ఇక, సంస్థ స్వతంత్ర డైరెక్టర్, ఆడిట్ కమిటీ అధ్యక్షుడిగా టీమ్‌లీజ్ సర్వీసెస్‌లో వైస్-ఛైర్మన్‌గా ఉన్న మనీష్ సబర్వాల్‌ను ఫోన్‌పే నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. దీనివల్ల కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఇంటర్నల్ కంట్రోల్, రిస్క్ మేనేజ్‌మెంట్ పద్దతులు మరింత మెరుగుపడతాయని కంపెనీ అభిప్రాయపడింది. 

Tags:    

Similar News